శబరిమలలో 18 మెట్ల వెనుక అసలు రహస్యం ఇదేనా? ఒక్కో మెట్టు దేనికి ప్రతీకో తెలుసా?

శబరిమల అయ్యప్పస్వామి దర్శనం.. కోట్లాది మంది భక్తుల జీవితాల్లో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక అనుభూతి. 41 రోజుల మండల దీక్ష, కఠిన నియమాలు, ఇరుముడి కట్టుతో కొండలు, అడవులు దాటుకుంటూ సాగే యాత్ర.. ఇవన్నీ పూర్తయ్యాక భక్తులకు ఎదురయ్యే అత్యంత పవిత్రమైన ఘట్టం 18 మెట్లు ఎక్కడం. అయ్యప్ప సన్నిధానానికి చేరుకునే ఈ మెట్లను అధిరోహించడం కేవలం ఆలయంలోకి ప్రవేశించడం మాత్రమే కాదు. దాని వెనుక లోతైన ఆధ్యాత్మిక తత్వం, ప్రత్యేకమైన చరిత్ర, ఎన్నో విశ్వాసాలు దాగి ఉన్నాయి.

విమానాల్లో మళ్లీ 'ఇరుముడి’కి అనుమతి- అయ్యప్ప భక్తులకు 'శరణ్' యాప్, పూర్తి సమాచారం..!!
విమానాల్లో మళ్లీ 'ఇరుముడి’కి అనుమతి- అయ్యప్ప భక్తులకు 'శరణ్' యాప్, పూర్తి సమాచారం..!!

18 మెట్ల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం
శబరిమలలోని ఈ 18 మెట్లను 'పదునెట్టాంబడి'అని పిలుస్తారు. ఒక్కో మెట్టుకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉందని భక్తులు విశ్వసిస్తారు.ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక వివరణ ప్రకారం..మొదటి ఐదు మెట్లు పంచేంద్రియాలకు (కళ్లు,చెవులు,ముక్కు,నాలుక,చర్మం)ప్రతీకలు.తర్వాతి ఎనిమిది మెట్లు కామం,క్రోధం,లోభం,మోహం,మదం,మాత్సర్యం,అసూయ వంటి అష్టరాగాలను సూచిస్తాయి.ఆ తర్వాతి మూడు మెట్లు సత్వ,రజో,తమో గుణాలకు ప్రతీకలు.చివరి రెండు మెట్లు విద్య,అవిద్యలను సూచిస్తాయి.వీటిని అధిగమించడమే ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గమని భావిస్తారు.

Secret Behind Sabarimala 18 Steps Spiritual Meaning of Each Step and Padipooja symbolism of each step Irumudi rules

మెట్ల చరిత్రలో ప్రత్యేకత
పురాణగాథల ప్రకారం,పండలం రాజుకు అయ్యప్పస్వామి 18 మెట్లతో ఆలయాన్ని నిర్మించాలని సూచించినట్లు కథనం ప్రచారంలో ఉంది.అయితే ఈ మెట్లకు సంబంధించిన వివిధ ఆధ్యాత్మిక వివరణలు కూడా ఉన్నాయి.తొలినాళ్లలో గ్రానైట్‌తో నిర్మించిన ఈ మెట్లకు 1985లో పంచలోహ కవచాన్ని ఏర్పాటు చేశారు.ప్రస్తుతం ఇవి బంగారు పూతతో అలంకరించబడి భక్తులకు దర్శనమిస్తున్నాయి

ఇరుముడి ఉంటేనే 18 మెట్లు ఎక్కే అర్హత
ఈ మెట్లను అధిరోహించడానికి కొన్ని సంప్రదాయ నియమాలు ఉన్నాయి.41 రోజుల దీక్షను పాటించి,తలపై ఇరుముడి ధరించిన భక్తులే పదునెట్టాంబడిని ఎక్కేందుకు అర్హులు.అందుకే ఈ మెట్ల ప్రయాణం భక్తుడి నియమ నిష్ఠలకు,ఆధ్యాత్మిక సిద్ధతకు ప్రతీకగా నిలుస్తుంది.

106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం!
106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం!

ప్రతి మెట్టు ఒక ఆధ్యాత్మిక సందేశం
అయ్యప్పస్వామి సన్నిధికి చేరుకునే ఈ 18 మెట్లు భక్తులకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తాయి.కోరికలు,కోపం,అహంకారం వంటి ప్రాపంచిక బంధాలను అధిగమించి మనసును పవిత్రంగా మార్చుకోవాలన్నదే వీటి అంతరార్థం.అందుకే శబరిమల యాత్రలో 18 మెట్లు ఎక్కడం ఒక ఆచారం మాత్రమే కాదు..భక్తుడి ఆత్మశుద్ధికి,ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రతీకగా భావిస్తారు.

ప్రతీ మెట్టుకో ప్రత్యేకత
ధర్మశాస్త్ర అవతారంలో అయ్యప్ప స్వామి మహిషిని సంహరించిన అనంతరం ఆ యుద్ధంలో ఉపయోగించిన 18 రకాల ఆయుధాలను విడిచిపెట్టిన ప్రదేశమే ఈ 18 మెట్లుగా మారిందని ప్రతీతి. ప్రతి మెట్టుపై ఓ అధిదేవత కొలువై ఉంటారు. హిందూ ధర్మంలోని 18 పురాణాల సారాంశాన్ని ఈ 18 మెట్లు సూచిస్తాయని పండితులు చెబుతారు. మెట్ల కింద కొబ్బరికాయను పగలగొట్టడం అంటే.. "స్వామీ నా అహంకారం అనే పెంకును పగలగొట్టి నాలోని స్వచ్ఛమైన హృదయంతో ఈ సన్నిధికి వస్తున్నాను" అని అర్థం. ఈ 18 మెట్లకు నిర్వహించే ప్రత్యేక పూజను 'పడిపూజ' అంటారు. ప్రతి మెట్టుపై దీపం వెలిగించి పూలతో అలంకరించి మంత్రోచ్ఛారణలతో ఈ మెట్లలోని దేవతలను ఆరాధిస్తారు. 18వ మెట్టు దాటగానే ఎదురుగా కనిపించే "తత్వమసి" అనే మహావాక్యం, భక్తుడు వెతుకుతున్న దేవుడు తనలోనే ఉన్నాడనే పరమసత్యాన్ని గుర్తుచేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+