TDP ఆస్తుల విలువ ఎంతో తెలుసా: విరాళాలు, ఖర్చు ఇలా- అసలు లెక్క..!!

తెలుగుదేశం పార్టీ తన ఆస్తుల లెక్కలు ప్రకటించింది. ఎన్నికల సంఘానికి పార్టీకీ సంబంధించిన ఆడిట్​ నివేదికలు సమర్పించింది. అందులో పార్టీకీ సంబంధించిన ఆస్తుల గురించి పూర్తి లెక్క లు వివరించింది. నగదు... ఆస్తుల రూపంలో ఎంత ఉందో స్పష్టత ఇచ్చింది. పార్టీకి విరాళాలుగా ఎంత వచ్చింది... నిర్వహణ కోసం చేస్తున్న ఖర్చు.. రుణాలు, అడ్వాన్సుల గురించి పూర్తి సమాచారం ఈ నివేదికలో వెల్లడించింది.

టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్ నివేదిక ద్వారా ఆస్తుల వివరాలు వెల్లడించింది. 2026 మార్చి 31 నాటికి తెలుగుదేశం పార్టీకి రూ.526 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఈ నివేదికలో వివరించింది. కొంత ఆస్తి నగదు రూపంలో ఉంటే, మిగతా ఆస్తి అసెట్ల రూపంలో ఉన్నట్లు వివరాలు సమర్పించింది. అయితే, గత సంవత్సరంతో (2024-25) పోలిస్తే రూ. 50.10 కోట్ల పెరుగుదల కనిపిస్తోంది. ఈ ఆస్తులలో బ్యాంకు డిపాజిట్ల రూపంలో రూ. 412 కోట్లు, భూములు, భవనాలు, పరికరాల వంటి భౌతిక ఆస్తుల రూపంలో రూ. 63.35 కోట్లు, అలాగే రుణాలు, అడ్వాన్సుల రూపంలో రూ. 51.37 కోట్లు ఉన్నాయని స్పష్టత ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌కోసం వెచ్చించే మొత్తం గతంలో రూ.15.84 కోట్లుగా ఉంటే.. దానిని రూ.46.25 కోట్లకు పెంచినట్లు వెల్లడించారు.

 శ్రీవారికి 121 కిలోల బంగారం ఇచ్చిన వర్థమాన్ జైన్ - ఆస్తుల విలువ, ఇదీ నేపథ్యం..!!
శ్రీవారికి 121 కిలోల బంగారం ఇచ్చిన వర్థమాన్ జైన్ - ఆస్తుల విలువ, ఇదీ నేపథ్యం..!!
tdp-assets-reach-rs-526-crore-as-of-march-2026-submits-report-to-the-election-commission

టీడీపీ అధికారిక లెక్కలు

కాగా, 2026 మార్చి 31నాటికి రూ.90.64 కోట్లు ఆదాయంగా వచ్చింది. ఫీజులు, విరాళాలుగా రూ.1.67 కోట్లు ఉంటే.. స్వచ్ఛంద విరాళాలు రూ.58.33కోట్లు వచ్చాయి. ఇటు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీలు, ఇతర పద్దులు కలిపి రూ.30.63కోట్లు ఉన్నాయి. ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.74.28 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఖర్చు చేసిన నిధుల్లో రూ.16.52 కోట్లు ఎన్నికల కోసం, ఉద్యోగుల జీత భత్యాలు, పరివాలన, ఇతర ఖర్చుల కోసం కేటాయించారు. టీడీపీ కార్యకర్తల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌కోసం రూ.46.25కోట్లు వెచ్చించారని ఆడిట్‌లో పేర్కొన్నారు. ఆర్థికాంశాల కింద రూ.1.40 కోట్లు, తరుగుదల కింద రూ.4.26 కోట్ల వ్యయం అయ్యింది. మిగిలిన రూ.16.35కోట్ల మొత్తాన్ని పార్టీ సాధారణ నిధికి జమ చేశారు. సాధారణంగా పార్టీ మహానాడు వేదిక గా ఈ లెక్కలు ప్రకటిస్తారు. ఇప్పుడు ఎన్నికల సంఘానికి అధికారికంగా నివేదిక సమర్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+