TATA: టాటా గ్రూపులో పోరు మరింత తీవ్రం- సన్స్ పై హైకోర్టుకు ట్రస్ట్స్..!

టాటా సన్స్ గ్రూపు ఛైర్మన్ గా మూడోసారి ఎన్. చంద్రశేఖరన్ ను నియమిస్తూ బోర్డు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టాటా గ్రూపునే కుదిపేస్తోంది. ఆయన పునర్ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నోయల్ టాటా ఆధ్వర్యంలోని టాటా ట్రస్టులు (Tata Trusts) ఇప్పుడు దీన్ని హైకోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు టాటా సన్స్ తో పాటు దాని ఆరుగురు డైరెక్టర్లపైనా బోంబే హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయబోతున్నాయి. దీంతో టాటా గ్రూపులో ఆధిపత్య పోరు మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టాటా సన్స్ కు ఆర్‌బీఐ అనూహ్య షాక్: ఐపీఓకు వెళ్లక తప్పదా? నెక్ట్స్ స్టెప్..!
టాటా సన్స్ కు ఆర్‌బీఐ అనూహ్య షాక్: ఐపీఓకు వెళ్లక తప్పదా? నెక్ట్స్ స్టెప్..!

ఎన్ చంద్రశేఖరన్ ను మూడోసారి ఐదేళ్ల పదవీకాలానికి పునర్ నియమిస్తూ నిర్ణయం తీసుకున్న టాటా సన్స్ తో పాటు దాని ఆరుగురు డైరెక్టర్లపైనా బోంబే హైకోర్టులో వేర్వేరు దావాలు దాఖలు చేసేందుకు సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ (ఎస్డీటీటీ), ఆర్.డి. టాటా ట్రస్ట్ (ఆర్డీటీటీ) సిద్ధమయ్యాయి. ఈ రెండు ట్రస్టులూ కలిసి 65 కోట్ల పరిహారంతో పాటు 18 శాతం వార్షిక వడ్డీని కూడా కోరుతున్నాయి. నోయల్ టాటా ఛైర్మన్ గా ఉన్న టాటా ట్రస్ట్స్ .. టాటా సన్స్ లో సుమారు 66 శాతం వాటా కలిగి ఉంది. దీంతో చంద్రశేఖరన్ ను పునర్ నియమించాలన్న టాటా సన్స్ బోర్డు తీర్మానాన్ని అది ప్రశ్నిస్తోంది.

Tata Trusts Plans Legal Challenge to N Chandrasekaran s Reappointment as Tata Sons Chairman
చంద్రశేఖరన్ కు టాటా ట్రస్ట్స్ షాక్- టాటా సన్స్ నిర్ణయంపై కీలక పరిణామం..!
చంద్రశేఖరన్ కు టాటా ట్రస్ట్స్ షాక్- టాటా సన్స్ నిర్ణయంపై కీలక పరిణామం..!

దీనిపైనే ఇప్పుడు సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ 50 కోట్లు, ఆర్.డి. టాటా ట్రస్ట్ 15 కోట్లు పరిహారం కోరబోతున్నాయి. టాటా సన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లోని ఆర్టికల్ 121 ప్రకారం చంద్రశేఖరన్ నియామకానికి అవసరమైన అనుకూల ఓటు లభించనందున, ఆయన నియామకం చెల్లదని టాటా ట్రస్టులు వాదిస్తున్నాయి. ఈ మేరకు సెప్టెంబర్ 17 నుంచి టాటా సన్స్ కు తాము పంపిన అభ్యంతరాలకు సంతృప్తికరమైన స్పందనలు లేకపోవడాన్ని కారణంగా చూపుతూ న్యాయపరమైన చర్యలు ప్రారంభించేందుకు ఈ రెండు ట్రస్టులు తీర్మానాలు ఆమోదించినట్లు సమాచారం. నామినీ డైరెక్టర్ల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడిన పక్షంలో నవంబర్ 30న జరిగే బోర్డు సమావేశంలో ఛైర్మన్ తన నిర్ణయాత్మక ఓటు వాడుకోకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ట్రస్టులు హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలో దాఖలు చేసే ఈ పిటిషన్లపై హైకోర్టు తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+