• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జూలై 2022 ద్వాదశ రాశుల వారికి మాసఫలాలు

By Staff
|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . డా.ఎం.ఎన్.ఆచార్య

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

ఈ నెలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. భయపడిన విధంగా తీవ్ర ఆటంకములు ఎదురవ్వవు. జీవిత భాగస్వామి నుండి సహకారం లభించడం వలన సమస్యల నుండి బయట పడతారు. సకాలంలో కుటుంబ సభ్యులకు వైద్య సహాయం అందించగలుగుతారు. ఉద్యోగ, వివాహ మరియు బ్యాంకు రుణ ప్రయత్నాలు చేయుటకు ప్రధమ ద్వితీయ వారాలు అనుకూలమైనవి.

అయితే గృహ నిర్మాణం ప్రారంభించుటకు లేదా కొనుగోలు సంబంద ప్రయత్నాలు చేయుటకు ఈ మాసం కలసిరాదు. ఉద్యోగులకు, వ్యాపార, వృత్తి జీవనం వారికి ధనార్జన పరంగా సాధారణ ఫలితాలు. ఈ మాసంలో 16, 17, 20, 29 మరియు 30 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

ఈ నెలలో ప్రధమ వారంలో ధనాదాయం బాగుండును. వ్యాపార వ్యవయరాలలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పెద్ద వయస్సు వారికి చేయించే శస్త్ర చికిత్సలు విజయవంతం అవుతాయి. ప్రధమ మరియు ద్వితీయ వారాలలో చేపట్టిన నూతన పనులు వేగంగా పూర్తి అవుతాయి. అవివాహితుల వివాహ ప్రయత్నాలకు, భవిష్యత్ గురించిన ఆలోచనలు గావించడానికి, వృత్తి రహస్యాలు తెలుసుకోవడానికి ఈ మాస ప్రధమ భాగం మంచి అనుకూల కాలం.

తృతీయ వారం సామాన్య ఫలితాలు ఏర్పడతాయి. చివరి వారంలో ఒక చిన్న ప్రమాదం వలన ధననష్టనికి అవకాశం ఉన్నది. మరియు పనిచేసే కార్యాలయంలో తోటి ఉద్యోగుల వద్ద ఇతరుల గురించి మాట జారకుండా ఉండుట మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

ఈ నెలలో అన్ని రకముల వ్యాపార వ్యవహారములకు, ఆర్ధిక క్రయ విక్రయాలకు అనుకూలంగా ఉండును. ద్వితీయ వారంలో నూతన గృహ నిర్మాణ ప్రయత్నములు చేయువారికి నిర్మాణ విషయంగా ఆఖస్మిక ఆటంకములు ఎదురవును. ధనాదాయం మాత్రం బాగుండును. విధ్యార్ధులకు వారి ప్రయత్నములు ఫలించి ఆశించిన రంగంలో విద్యాప్రవేశం లభిస్తుంది. తృతీయ వారంలో ఆటంకములు ఎదురైనా పనులు పూర్తీ అవుతాయి.

ఉద్యోగ జీవనంలో ఆకస్మిక చికాకులు ఎదుర్కొంటారు. పెద్ద వయస్సు స్త్రీలను అనారోగ్య సమస్యలు వేధించు సూచన ఉన్నది. బాగా ఎదిగిన సంతానం ప్రవర్తన వలన కూడా మనసు ఆందోళన చెందును. ఈ మాసంలో 21 నుండి 24 వ తేదీల మధ్య ఋణములు కోసం చేయు ప్రయత్నాలు ఫలించును. కుల వృత్తి సంబంధ వ్యాపారములు చేయువారికి ఈమాసం కలసి వచ్చును. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

ఈ నెలలో ఆర్ధికంగా అనుకూల ఫలితాలు ఉన్నా , ఆరోగ్య విషయాలు చికాకు కలుగచేయును. అనారోగ్య సంబంధ ధన వ్యయం కొనసాగును. ఆశించిన స్థాయిలో పై అధికారులు లేదా తోటి ఉద్యోగుల నుండి సహకారం లభించదు. ఇరుగుపొరుగు వారితో విరోధములు అప్రతిష్టపాలు చేస్తాయి. స్థాన చలన ప్రయత్నాలు కలసి రావు. స్త్రీలకు సదా మానసిక ఆందోళన ఎదురగు సూచన ఉన్నది. ముఖ్యంగా 17, 18 తేదీలలో వాహన ప్రమాదమునకు సూచనలు అధికం. 19 వ తేదీ తదుపరి వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి , వ్యాపార విస్తరణకు అనుకూలమైన కాలం ఆరంభం అవుతుంది.

అన్నివిధములా పరిస్థితులు చక్కబడతాయి. మొత్తం మీద ఈ మాసంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొనుట మంచిది కాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

ఈ నెలలో రక్తసంభందీకుల వలన మీ ఆలోచనలు కార్యరూపం దాల్చును. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. గృహంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వివాహ ప్రయత్నములు కలసివచ్చును. ఉద్యోగ మార్పుప్రయత్నాలు విజయవంతం అగును. ప్రతీ విషయంలో తీవ్రంగా ఆలోచన చేయుట పనికిరాదు. మీపై అందరూ సానుభూతి ప్రదర్సించాలి అనే కొరిక సమస్యలకు దారితీయును.

వృద్దులకు శ్వాస సంబంధ , నేత్ర సంబంద సమస్యలు ఎదురగును. తృతీయ వారంలో మీ పై అధికారులను ప్రతిభతో ఆకట్టుకుంటారు. వారి నుండి గౌరవ మర్యాదలు పొందేదురు. ఉద్యోగ లక్ష్యం సిద్ధిస్తుంది. చివరి వారం ప్రశాంతంగా గడుపుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఈ నెలలో సంతాన సంబంధ ప్రయత్నాలు లాభించును. ధనాదాయం సామాన్యం. గృహంలో స్త్రీ సంతాన సంబంధ శుభకార్యములు నిర్వహిస్తారు. దూర దేశములందు పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఆఖస్మిక ఉద్యోగ నష్టం. వ్యాపార రంగంలోని వారు ఆశించిన విధంగా లాభం పొందుతారు. తృతీయ వారం నుండి పనిలో ఉత్సాహకర సమయం ప్రారంభం అవుతుంది.

చివరి వారంలో ఉద్యోగ నష్టం ఎదుర్కొన్న వారికి కెరీర్ పరంగా నూతన అవకాశాలు లభిస్తాయి. చివరి వారం అవివాహితులకు కూడా వివాహ అనుకూలత కలుగచేయు సూచన ఉన్నది. అయితే ఈ మాసం అధికారులను కలువుటకు, కుటుంబ సమస్యల్లో మధ్యవర్తిత్వానికి అనుకూల కాలం కాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

ఈ నెలలో ప్రధమ అర్ధభాగం చక్కటి అనుకూల ఫలితాలు, ఆశించిన లాభాలు ఏర్పరచును. నూతన ఆదాయ మార్గాలు ప్రారంభం అగును. సొంత వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలించును. ధనాదాయం ఆశించిన విధంగా బాగుండును. తృతీయ వారం ప్రారంభంలో జీవిత భాగస్వామితో చిన్న తగాదా. మాస ద్వితియార్ధంలో స్థాన చలన సంబంధ ప్రయత్నాలు విఫలం అగును.

ప్రస్తుత నివాస గృహాన్ని మార్చవలసి వచ్చును. గొంతు సంబంధ ఆరోగ్య సమస్యలు ఏర్పడుటకు సూచనలు కలవు. కుటుంబ సభ్యులతో వ్యవహరించునపుడు పట్టు విడుపులు అవసరం. ఖర్చు విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు జరపడం మంచిది. చివరి వారంలో శుభవార్తలు వింటారు. దూర ప్రాంత ప్రయానములు ఫలప్రదం అవుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

ఈ నెలలో నూతన ప్రయత్నాలు విజయవంతం అగును. ఆశించిన శుభ ఫలితాలు ఏర్పడును. సంతాన ప్రయత్నములు మాత్రం కేతు గ్రహం వలన విఫలం అగును. జీర్ణ సంబంధ లేదా నరముల సంబంధ ఆరోగ్య సమస్యలు బాధించు సూచన ఉన్నది. ధనాదాయం ఆశించిన విధంగా బాగుండును. ఈ మాసంలో 8 నుండి 15 వ తేదీల మధ్యకాలంలో వాహన చోదన విషయంలో జాగ్రత్త అవసరం.

ముఖ్యంగా అనురాధా నక్షత్ర జాతకులు జాగ్రత్త వహించాలి. వ్యాపారములందు శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు మరియు మూలధనాన్ని సమీకరించుకొంటారు. ధన సమీకరణలో జీవిత భాగస్వామి వలన లాభ పడతారు. 22 వ తేదీ తదుపరి ఉద్యోగస్తులకు చక్కటి ప్రశంసలు లేదా ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం ఏర్పడుతుంది. రాజకీయ రంగంలోని వారు కీర్తిని ఆర్జించ గలుగుతారు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

ఈ నెలలో పెద్ద వయస్సు వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. నూతన వ్యవహారాలు ప్రారంభిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యంగా మూలా నక్షత్ర జాతకులు చేపట్టిన కార్యములు విజయవంతం అగును. వివాహ ప్రయత్నాలు ఫలించును. కోరుకున్న వాహనాలు లేదా ఇష్టత కలిగిన ఆభరణాలు కొనుగోలు చేయుటకు ఈ మాసం మంచి కాలం. అన్ని వర్గముల వారికి ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది.

వ్యాపార వర్గములకు ఆశించిన ధన ఆదాయం లభిస్తుంది. ఈ మాసంలో ద్వితీయ వారం అనగా 7 నుండి 14 వ తేదీల మధ్య అనుకోని వివాదాల వలన ధనం ఖర్చవుతుంది. 19 నుండి 25 వరకూ ఉన్న కాలం అన్ని విధములా విజయవంతమైన ఫలితాలు ఏర్పరచును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఈ నెలలో ఉద్యోగ, వ్యాపార వృత్తి జీవనం వారికి సామాన్య ఫలితాలు ఎదురగును. విద్యా సంబంధ వ్యాపారములు చేయు వారికి అతి చక్కటి లాభములు లభించును. నిరుద్యోగుల ఉద్యోగ అన్వేషణ ఫలించును. నూతన వ్యాపార ప్రారంభాలకు లేదా నూతన ఆలోచనలు కార్యాచరణలో పెట్టుటకు ధనం సకాలంలో అందుతుంది. తృతీయ వారం నుండి నిరంతరం కష్టించి పనులు సకాలంలో పూర్తి చేయుదురు.

పదోన్నతి పొందుటకు కార్యాలయంలో వాతావరణం ఉత్సాహపూరితంగా ఉండును. నూతన వస్తువులు గృహంలో సమకుర్చుకుంటారు. వ్యక్తిగత జీవితంలో సమస్యలకు పరిష్కారం లభించును. మాసాంతంలో విందు వినోదాలు, కుటుంబ మిత్రులతో కలయికలు. ఆహ్లాదకరమైన సమయం ఎదురగును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ఈ నెలలో లాభాపురితంగా ఉంటుంది. ధనాదాయం బాగుండును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నములు లాభించును. దూర ప్రాంత ఉద్యోగ లేదా విదేశీ నివాశ ప్రయత్నాలు కూడా ఫలించును. సంతాన ప్రాప్తి కోసం వైద్య పరంగా ధనం ఖర్చు అగును. ద్వితీయ తృతీయ వారములలో శుభవార్తలు వింటారు. చివరి వారం అంత అనుకూలంగా ఉండదు.

జ్వరతత్వ ఆరోగ్య సమస్యలు బాధించును. ఆలోచనలు అదుపులో ఉండవు. నష్టపురిత ఆలోచనలు అధికంగా చేయుదురు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

ఈ నెలలో కొద్దిపాటి సమస్యలు, పని ఒత్తిడులతో ప్రారంభం అగును. మీ ఊహా శక్తి ఈ మాసంలో అనుకూలంగా పనిచేయదు. వివాహ ప్రయత్నాలలో విఘ్నాలు ఎదురగును. సొంత మనుషుల వలన వివాహ సంబంధాలు విఫలం అగుట తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. కుటుంబ అనారోగ్య సమస్యలు అధిక వ్యయమును కలుగ చేస్తాయి. ద్వితీయ వారం చివరి వరకూ నూతన ప్రయత్నాలు సఫలం అగుట కష్టం.

బంధు వర్గంతో విరోధాలు ఎదుర్కొందురు. తృతీయ వారం నుండి ధనాదాయం బాగుండును. జీవనంలో లాభకరమైన పరిస్థితులు ఎదురగును. తిరిగి మనోబలం పెరుగును. మిత్ర వర్గంతో సర్దుకుపోవుట మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

English summary
The monthly forecasts for 2017 August cover all the star signs from Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius to Pisces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X