‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..!

సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉగాది పండగ సందర్భంగా 19వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ అందింది. పవన్ అభిమానులకు ఈ సినిమా ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోనుందంటున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ పవన్ ను తన మార్క్ ఎలివేషన్లతో సరికొత్తగా ఆవిష్కరించారని సమాచారం.

మాస్ ఎలివేషన్ కేక

ఈ సినిమా కథనం ప్రారంభం నుంచే చాలా స్పీడ్‌గా ఉంది. మొదటి భాగంలో ఎనర్జిటిక్ కామెడీ, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లతో సినిమా చాలా సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. సినిమాకు అత్యంత కీలకమైన ఇంటర్వెల్ బ్లాక్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయమని, అది ఒక అద్భుతమైన మాస్ ఎలివేషన్ అని టాక్ వినిపిస్తోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, సెకండాఫ్‌లో బలమైన సామాజిక సందేశం ఉంది. కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఎమోషనల్ డ్రామాను హరీష్ శంకర్ అద్భుతంగా తీర్చిదిద్దారు.

Ustaad Bhagat Singh Censor Review Check the Rating It Received Out of 5 for pawan kalyan film

బీజీఎంతో సినిమా స్థాయి మారిపోయింది

ఈ సినిమాకు సంగీతం మరో పెద్ద అసెట్. దేవి శ్రీ ప్రసాద్ ప్రతి యాక్షన్ సీన్‌ను బీజీఎంతో నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారంటున్నారు. పతాక సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ చేసిన యాక్షన్, పవర్ ఫుల్ డైలాగులు సినిమాకు ప్రాణంగా నిలవనున్నాయి. ఒకరకంగా పవన్ అభిమానులకు ఇది పండగలాంటిందంటున్నారు. ఒకసారి బ్లాక్ బస్టర్ కొట్టిన కాంబో మళ్ళీ జతకట్టడం, దానికి తోడు సెన్సార్ నుంచి వస్తున్న సానుకూల రిపోర్టులతో ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాయి.

'ఉస్తాద్ భగత్ సింగ్' బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2026లో ఉస్తాద్ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి. మొత్తంగా సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పినదాని ప్రకారం ఈ సినిమాకు 5కు 3 రేటింగ్ ఇవ్వొచ్చని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+