విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. మీ కోసం కొత్త స్కీమ్!

తెలంగాణలో విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లాలనుకునే యువతకు శుభవార్త. ప్రభుత్వం కొత్తగా ముఖ్యమంత్రి విదేశీ ఉపాధి పథకాన్ని ప్రారంభించి, దాని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల యువత విదేశాల్లో మంచి ఉద్యోగాలు సంపాదించుకునేందుకు ఆర్థిక సాయం, శిక్షణ, మార్గదర్శకత్వం అందించేందుకు ఈ పథకం రూపొందించబడింది.

తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్‌కామ్ ద్వారా ఈ పథకం అమలు కానుంది. విదేశాల్లో నైపుణ్యం ఉన్న కార్మికులు, వృత్తి విద్య పూర్తి చేసిన యువతకు అనేక రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అయితే సరైన సమాచారం లేకపోవడం, అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం, విదేశాలకు వెళ్లేందుకు ఎక్కువ ఖర్చు కావడం వల్ల పేద కుటుంబాల యువత ఈ అవకాశాలను అందుకోలేకపోతున్నారని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఈ పథకం తీసుకొచ్చింది.

Telangana foreign employment scheme Good News for Telangana Youth Going Abroad for Jobs Scheme Guidelines Released

ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 7 వేల మందికి ఆర్థిక సాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీరిలో నేరుగా విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే 5,880 మందికి రూ.50 వేల వరకు సాయం లభిస్తుంది. విదేశీ భాషల్లో ప్రావీణ్యం అవసరమైన ఉద్యోగాలకు వెళ్లే 1,120 మందికి రూ.1.75 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. అభ్యర్థుల ఆసక్తి, విద్యార్హతలు, వృత్తి నైపుణ్యాలు, విదేశాల్లో ఉన్న ఉద్యోగావకాశాలను బట్టి కేటగిరీలు నిర్ణయిస్తారు.

టామ్‌కామ్ విదేశీ భాషల్లో శిక్షణ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యాల పెంపు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు సహకరిస్తుంది. సురక్షితంగా, చట్టబద్ధంగా విదేశాల్లో ఉద్యోగాల్లో చేరేందుకు పూర్తి మద్దతు ఇస్తుంది. నర్సింగ్, హాస్పిటాలిటీ, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, ఐటీ, హెల్త్‌కేర్ వంటి పది రంగాల్లో ఉద్యోగాలకు వెళ్లే వారికి ఈ పథకం వర్తిస్తుంది.విదేశాల్లో ఉద్యోగాలు చేసి తిరిగి వచ్చిన వారు స్థానికంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించి, ఇతర యువతకు ఉపాధి కల్పించే అవకాశాలు కూడా ఉన్నాయి.

బాసర నుంచి భద్రాద్రి వరకు ఆలయాలకు కొత్త శోభ: గోదావరి తీరంలో టెంపుల్ కారిడార్!
బాసర నుంచి భద్రాద్రి వరకు ఆలయాలకు కొత్త శోభ: గోదావరి తీరంలో టెంపుల్ కారిడార్!

గల్ఫ్ దేశాలు, యూరప్, సింగపూర్, జపాన్, కెనడా వంటి దేశాల్లో నైపుణ్యం ఉన్న భారతీయ యువతకు డిమాండ్ పెరుగుతోంది. ఈ పథకం ద్వారా తెలంగాణ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చు.ఆసక్తి ఉన్న యువత టామ్‌కామ్ అధికారిక వెబ్‌సైట్ లేదా సమీప కేంద్రాల్లో సంప్రదించి అప్లై చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలు, అర్హతలు తనిఖీ చేసి, సరైన మార్గదర్శకత్వంతో ముందుకు సాగాలి. ప్రభుత్వం ఈ పథకం ద్వారా యువతను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా, విదేశాల్లో సురక్షిత ఉపాధిని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+