కన్యారాశి వారికి ఈ ఉగాది నుండి పట్టిందల్లా బంగారమే.. కలిసొచ్చే లక్కీ ఇయర్!
మార్చి 19వ తేదీన తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది ప్రారంభం కాబోతుంది. ఈ ఉగాది పరాభవ నామ ఉగాదిగా రాబోతోంది. ఈ పరాభవ నామ ఉగాదికి కన్యా రాశి వారికి ఎటువంటి గ్రహ స్థితి ఉండబోతుందో జ్యోతిష నిపుణులు వివరించారు. కన్యారాశి జాతకుల కెరీర్, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరమైన అంశాలపై ఈ ఏడాది ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం.
కన్యా రాశి జాతక ఫలం
ఉత్తర నక్షత్రం 2, 3, 4పాదాలు, హస్తా, చిత్తా ఒకటి, రెండు పాదాలలో జన్మించినవారు కన్యారాశి జాతకులు అవుతారు. వీరి ఆదాయం- 8 గాను వ్యయం-11 గాను ఉంటుంది. రాజపూజ్యం- 3 అవమానం- 3గా ఉంటుంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో కన్యారాశి వారికి 75%సానుకూలఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కన్యారాశి వారికి గ్రహ స్థితులను బట్టి చూస్తే అన్ని విధాల ముందంజ వేయడానికి అవకాశం ఉంది.

ఆర్థిక స్థితి
ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయం అద్భుతంగా ఉంటుంది .ఇదే సమయంలో ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. కన్యా రాశి వారి గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంగారం, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీరు తక్కువగా కొనుగోలు చేసుకున్న ఆస్తులు విలువ పెరిగి ఊహించని ప్రతిఫలాలను ఇస్తాయి.
ఉద్యోగులకు
కన్యారాశి ఉద్యోగులకు గురుబలం వల్ల కెరీర్ పరంగా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. టెక్నికల్ రంగంలో పని చేసేవారు పెద్దపెద్ద కంపెనీలలో ఉద్యోగాలు సంపాదిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికార హోదాలో పనిచేసే వారికి మరింత గుర్తింపు ఉంటుంది. నిరుద్యోగులు ఈ సంవత్సరం శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు అనుకూలంగా ఈ సంవత్సరం ఉంటుంది. అకౌంట్స్, టీచింగ్, బ్యాంకింగ్, కమ్యూనికేషన్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది.
వ్యాపారస్తులకు
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ద్వితీయ అర్థం నూతన వెంచర్లు మొదలుపెట్టడానికి మంచి సమయంగా ఉంటుంది. పెట్టుబడులలో తొందరపాటుతనంతో వ్యవహరించకుండా ఉండాలి. వ్యాపారస్తులకు దీర్ఘకాలిక ప్రణాళికలు మేలు చేస్తాయి. నూతన పెట్టుబడుల విషయంలో ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు ఆర్థిక లాభాలను ఇస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కీలకమైన ఒప్పందాలను చేసుకుంటారు. విదేశాలకు ఎగుమతులు చేసే వ్యాపారులు, రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లు విపరీతంగా లాభపడతారు.
కుటుంబ జీవితం
ఈ సంవత్సరం కన్యా రాశి వారి కుటుంబ జీవితం సాధారణంగా అనుకూలంగా ఉన్నప్పటికీ, కొన్ని విషయాలలో జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామి సలహాల మేరకు ఇష్టం లేని కొన్ని నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కన్యారాశి జాతకులు ఆవేశానికి లోను కాకుండా సహనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. పిల్లల అభివృద్ధి సంతోషాన్నిస్తుంది.
ఆరోగ్యం
ఈ సంవత్సరం కన్యారాశి జాతకులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల వెన్నునొప్పి నరాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. సమయానికి భోజనం చేయాలి. ఈ రాశి స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టే అవకాశాలున్నాయి.
కన్యా రాశి వారికి శుభ ఫలితాల కోసం పరిహారాలు
కన్యా రాశి వారు శుభ ఫలితాల కోసం కొన్ని పరిహారాలను పాటించవచ్చు. కన్య రాశి జాతకులు బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది. ఆవుకు పచ్చగడ్డి తినిపించడం, పెసలు దానం చేయడం వంటివి చేస్తే వీరికి బుధ గ్రహ అనుకూలత లభిస్తుంది. సంకటహర చతుర్ధి నాడు గణపతికి గరికతో పూజ చేయడం కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది.












Click it and Unblock the Notifications