సుడిగాలి సుధీర్ పై 'గోట్' మూవీ ప్రొడ్యూసర్ సంచలనం.. రెమ్యూనరేషన్ తీసుకుని షూటింగ్ కు రాలేదంటూ..
జబర్దస్త్ షోతో బుల్లితెరపై కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు సుడిగాలి సుధీర్. ఆ తర్వాత యాంకరింగ్ తోనూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం వెండితెరపై సాఫ్ట్ వేర్ సుధీర్, 3 మంకీస్, గాలోడు, కాలింగ్ సహస్ర, గోట్ తదితర సినిమాలు చేశాడు. అయితే గోట్ మూవీ రిలీజ్ కు ముందే అనేక వివాదాలతో వార్తల్లో నిలిచింది. దాదాపు రెండేళ్ల పాటు ఈ మూవీ వాయిదా పడుతూ వచ్చింది. దర్శకుడు.. హీరో.. హీరోయిన్ మధ్య విభేదాలు.. సినిమా షూటింగ్ లో పలు సమస్యలు ఇలా ఎన్నో అడ్డంకులను దాటి ఈ మూవీ ఇటీవల రిలీజ్ అయింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన విజయాన్ని మాత్రం ఈ మూవీ అందుకోలేకపోయింది.
అయితే తాజాగా ఈ సినిమా నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి.. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్, దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రెమ్యూనరేషన్ మొత్తం ఇచ్చినా సుడిగాలి సుధీర్ షూటింగ్ రానని చెప్పాడని తెలిపారు. ఈ విషయంపై ఆయన్ను ప్రశ్నించినా సరైన స్పందన రాలేదని ఆరోపించారు. చివరకు తన ఫోన్ నంబర్ ను కూడా బ్లాక్ చేశాడని ఆరోపించారు. ఆయన అడిగినందుకు సినిమా బడ్జెట్ ను రూ. 2కోట్లు పెంచామని పేర్కొన్నారు. సుధీర్- దర్శకుడు మంచి స్నేహితులు కావడంతో మొదట్లో వారు చెప్పిన విషయాలను నమ్మానని.. కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదన్నారు.

ఇక గోట్ మూవీ చివరి 30 శాతం షూటింగ్ సుధీర్ లేకుండానే పూర్తి చేయాల్సి వచ్చిందని నిర్మాత చంద్రశేఖర్ తెలిపారు. క్లైమాక్స్ లో కొన్ని సన్నివేశాలను డూప్స్, సీజీ సహాయంతో చిత్రీకరించాల్సి వచ్చిందన్నారు. ఇక సినిమా మొత్తం పూర్తవడానికి రూ. 14 కోట్ల వరకు ఖర్చు అయిందని నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హైలెస్సో అనే సినిమా చిత్రీకరణలో ఉన్నారు.












Click it and Unblock the Notifications
