రూ.1.27 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి.. దశ తిరిగినట్టేనా!

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం రూపురేఖలను పూర్తిగా మార్చేసే భారీ చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అధికారికంగా ఆమోదం తెలిపింది. సుమారు రూ.1.27 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో, ఏటా 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఈ అత్యాధునిక రిఫైనరీని నిర్మించనున్నారు.

రాష్ట్రానికి దక్కిన ఈ అతిపెద్ద పెట్టుబడి పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలవనుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. కేవలం రాష్ట్ర ప్రగతికే కాకుండా, దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంలోనూ, జాతీయ రిఫైనింగ్ సామర్థ్యాన్ని పెంచడంలోనూ ఈ కర్మాగారం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

BPCL refinery Ramayapatnam Massive Boost to Andhra Pradesh BPCL Approves Rs 1 27 Lakh Crore Refinery at Ramayapatnam

ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రామాయపట్నం పోర్టుతో అనుసంధానం.. అనుబంధ పరిశ్రమలకు ఊతంగా మారుతుందని భావిస్తున్నారు. రామాయపట్నంలో ఇప్పటికే పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో, దానికి సమీపంలోనే బీపీసీఎల్ రిఫైనరీ రావడం వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

ముడి చమురు దిగుమతి చేసుకోవడానికి, శుద్ధి చేసిన ఇంధన ఉత్పత్తులను దేశవిదేశాలకు ఎగుమతి చేయడానికి రామాయపట్నం పోర్టు ప్రధాన రవాణా కేంద్రంగా ఉపయోగపడనుంది.ఈ రిఫైనరీతో పాటు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటయ్యే అవకాశాలు ఉండటంతో, దానిపై ఆధారపడి పనిచేసే అనేక అనుబంధ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు ఈ ప్రాంతానికి తరలివచ్చే వీలుంది.

సామర్లకోట-కాకినాడ పోర్టు నాలుగు లైన్ల జాతీయ రహదారి 516ఎఫ్ పై కీలక అప్డేట్
సామర్లకోట-కాకినాడ పోర్టు నాలుగు లైన్ల జాతీయ రహదారి 516ఎఫ్ పై కీలక అప్డేట్

ప్లాస్టిక్, రసాయనాలు, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో కొత్త పెట్టుబడులు వస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఆర్థిక ముఖచిత్రం మారడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో భారీ ఆదాయం సమకూరనుంది. రాబోయే రోజుల్లో దక్షిణ కోస్తా ప్రాంతం దేశంలోనే ఒక ముఖ్యమైన ఇంధన, పెట్రోకెమికల్ హబ్‌గా ఎదిగేందుకు ఈ ప్రాజెక్టు బలమైన పునాది వేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+