Alias Rukmini First Review: నితిన్ 'అలియాస్ రుక్మిణి' ఫస్ట్ రివ్యూ.. ఏడిపించేసాడు భయ్యా..!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. భీష్మ మూవీ తర్వాత నితిన్ కు సరైన హిట్ పడలేదనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత వచ్చిన మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అవి ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాయి. ఈ క్రమంలో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో మంచి కంటెంట్ ఉన్న స్టోరీతో వస్తున్నారు. అదే 'అలియాస్ రుక్మిణి' మూవీ.. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4 న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసిన సంగతి తెలిసిందే.
అలియాస్ రుక్మిణి మూవీలో నితిన్ సరసన హీరోయిన్ గా అఫియా సయ్యద్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక 'దండోరా' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీకాంత్ దేవసోత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాని సమర్పణలో దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఈ మూవీని తాజాగా ప్రసాద్ ల్యాబ్స్ లో డిస్ట్రిబ్యూటర్లకు ప్రదర్శించినట్లు సమాచారం. వాళ్ల నుంచి వస్తున్న టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక ఈ మూవీకి అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చినట్లు తెలుస్తోంది. నితిన్ కెరీర్ లోనే భారీ ఎమోషనల్ స్టోరీగా ఇది తెరకెక్కినట్లు సమాచారం.

అలియాస్ రుక్మిణి మూవీ సెకండాఫ్ లో నితిన్ అద్భుతమైన నటనను కనబరిచాడని.. ఏడిపించాడని మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ మూవీ ఫుల్ రివ్యూ కోసం డిసెంబర్ 4 వరకు ఆగాల్సిందే. ఇక నితిన్ కు చాలా రోజులుగా ఓ మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నితిన్ ఇలాంటి కొత్త కథను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ మూవీతో నితిన్ భారీ కమ్ బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి. ఇక ఈ మూవీలో హర్షవర్ధన్, సాయికుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని నాని సమర్పణలో దీప్తి గంటా నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications
