డిసెంబర్‌ లో చూడదగిన అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఇవే..!

మరో రెండు రోజుల్లో డిసెంబర్ మాసం వచ్చేస్తోంది. అయితే డిసెంబర్ లో ఇయర్ ఎండ్ టూర్స్ ను చాలామంది ప్లాన్ చేస్తుంటారు. చాలా స్కూల్స్ కు క్రిస్మస్ హాలీడేస్ ఇస్తుంటారు. కాబట్టి ఫ్యామిలీ తో ఎంజాయ్ చేయడానికి డిసెంబర్ నెల పర్ఫెక్ట్ గా భావిస్తుంటారు. ఇక డిసెంబర్ లో వింటర్ సీజన్ పీక్స్ లో ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్తే బాగుందుందో ఇక్కడ తెలుసుకుందాం..

ఉత్తరాఖండ్‌ లోని ధనౌల్తీ ప్రాంతం.. పర్ఫెక్ట్ డెస్టినేషన్‌ గా చెప్పుకోవచ్చు. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఈ ప్రాంతం ఒకటి. ధనౌల్తీ చుట్టూ ఎత్తయిన కొండలు.. కన్నుల విందుగా కనిపించే లోయలు.. ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ నుంచి పర్యటకులను రానివ్వదు. ఇది ఒక హిల్ స్టేషన్ కాగా గర్హ్వాల్ హిమాలయ శ్రేణుల దిగువ ప్రాంతంలో ఈ హిల్ స్టేషన్ ఉంది. ఏటా వేలాది మంది టూరిస్టులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఈ హిల్ స్టేషన్ లో నేచర్ వాక్, ట్రెక్కింగ్, అడ్వెంచర్ యాక్టివిటీస్ తోపాటు పార్క్ సందర్శనలతో ఎంజాయ్ చేసేందుకు వీలుగా ఉంటుంది. అలాగే ఈ హిల్ స్టేషన్ నుంచి సుందరమైన హిమాలయాలను కనులారా వీక్షించవచ్చు.

ఇక హిమాచల్ ప్రదేశ్ అనేక పర్యాటక ప్రదేశాలకు నెలవుగా ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ లోని ప్రముఖ టూరిస్ట్ ప్రాంతాల్లో ధర్శశాల ఒకటి. ఇది ఒక అద్భుతమైన హిల్ స్టేషన్. ఇక్కడి ఎత్తయిన పర్వతాలు, దట్టమైన అడవులు, ఆహ్లాదంగా ఉండే చల్లని వాతావరణం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా ఉంటుంది. ఇక్కడ ఏడాదిపాటు నిత్యం పర్యాటకులు వస్తుంటారు. ఈ ప్రాంతంలోని భాగ్‌ సునాగ్ జలపాతం చాలా ఫేమస్. అలాగే ధరమ్ కోట్ పిక్నిక్ స్పాట్ కూడా ప్రముఖ టూరిస్టు ప్రాంతంగా ఉంది.

కశ్మీర్‌ లోని అందమైన ప్రాంతాల్లో గుల్మార్గ్ ఒకటి. ఈ ప్రాంతంలోని దారులన్నీ మంచుతో నిండి ఉంటాయి. ఈ మార్గంలో ప్రయాణించడం మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. బారాముల్లా జిల్లాలో ఉన్న ఈ గుల్మార్గ్‌ లో ఏటా నవంబర్‌ చివరి వారం వచ్చేసరికి మంచు దుప్పటి కప్పుకుంటుంది. దాంతో ఇక్కడ స్కేటింగ్‌, స్కీయింగ్‌ ఆటలు జరుగుతాయి.

Tourist Here are some wonderful tourist destinations to visit in December plan your trip right away

ఇక మంచుతెరలను తోసుకుంటూ దాదాపు ఐదు కిలోమీటర్లు సాగే కేబుల్‌ కారు ప్రయాణం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది. ఇక గుల్మార్గ్ ప్రాంతం శ్రీనగర్‌ నుంచి 51 కి. మీ. దూరంలో ఉంటుంది. అలాగే జమ్మూ నుంచి సుమారు 320 కి. మీ. దూరంలో ఉంటుంది. వీటితోపాటు ఈ సీజన్ లో షిమ్లా, మనాలి ప్రాంతాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మీరూ ఓసారి ట్రై చేయండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+