తిరుప్పరంకుండ్రం కొండపై కిలోల కొద్దీ నెయ్యి, కాటన్ క్లాత్, కర్పూరం తరలింపు: ఇంకాస్సేపట్లో

తమిళనాడు మధురై జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపోత్సవం నిర్వహణకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా కొండపై ఉన్న ప్రాచీన రాతి స్తంభం దీపత్తూన్ వద్ద ఈ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ మహా దీపాన్ని వెలిగించనున్నారు. ఈ ఘట్టాన్ని తిలకించడానికి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తోన్నారు. దీంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు కొండ చుట్టూ భారీ భద్రతను కల్పించారు.

దీపాన్ని వెలిగించడానికి అవసరమైన పూజా ద్రవ్యాలను ఆలయ సిబ్బంది కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ కొండపైకి తరలించారు. దీపారాధన కోసం 30 కిలోల స్వచ్ఛమైన నెయ్యి, ప్రత్యేకంగా తయారు చేసిన 50 మీటర్ల పొడవైన ఖాదీ వత్తి, అయిదు కిలోల కర్పూరం, మూడు పెద్ద మట్టి ప్రమిదలను కొండపైకి తీసుకెళ్లారు. బకెట్లు, క్యాన్లతో నెయ్యిని తీసుకెళ్లారు సిబ్బంది. సుబ్రహ్మణ్యస్వామివారి స్తోత్రాలు, మంత్రాలను జపిస్తూ, డోలు వాయిస్తూ ఆచారాల ప్రకారం ఆయా సామాగ్రిని దీపత్తూణ్ వద్దకు తరలించారు.

Thirupparankundram lamp lighting as 30 kg ghee 50 metre cotton cloth 5 kg camphor taken to hilltop

ఎత్తైన రాతి స్తంభం వద్ద అర్చకులు, ఆలయ అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుగా కర్రలతో తాత్కాలిక వేదికలను నిర్మించారు. కొండపైకి చేరుకునే మార్గం, దీపం వెలిగించే ప్రాంగణంలోనూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముళ్ల కంచెలు, భద్రతా రోప్‌లను ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు కొండపై పర్యవేక్షణ చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అర్చకులు, ఆలయ సిబ్బంది, కొంతమంది సహాయకులు కలిపి మొత్తం 50 మందికి మాత్రమే కొండపైకి వెళ్లడానికి అనుమతి ఉంది.

అర్ధరాత్రి తిరుప్పరంకుండ్రం చేరిన కేంద్ర బలగాలు
అర్ధరాత్రి తిరుప్పరంకుండ్రం చేరిన కేంద్ర బలగాలు

కార్తీక పౌర్ణమి వేళ తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించే సంప్రదాయానికి ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ ప్రాంతంలో దీపారాధన నిర్వహణపై గతంలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థాన నిబంధనలకు లోబడి, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి తమిళనాడు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాయి.

సాయంత్రం జ్యోతి ప్రజ్వలన జరగగానే తిరుప్పరంకుండ్రం పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభతో నిండిపోనున్నాయి. దీపోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా, తాగునీరు, ప్రాథమిక వైద్య సదుపాయాలను అధికారులు అందుబాటులో ఉంచారు. కోర్టు మార్గదర్శకాలకు కట్టుబడి ఈ ఆధ్యాత్మిక వేడుకను అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగించడానికి అన్ని చర్యలు తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+