డీలిమిటేషన్ వేళ కీలక పరిణామాలు - ఆపరేషన్ షురూ, లెక్క పక్కా..!!

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం లాంఛనమే. డీఎంకే, ఎన్సీపీ మద్దతుతో ఇక పార్లమెంట్ వేదికగా ఈ బిల్లు ఆమోదం పొండటం ఖాయంగా కనిపిస్తోంది. దీని ద్వారా అన్ని రాష్ట్రాలోని ఎంపీ స్థానాలతో పాటుగా అసెంబ్లీ స్థానాలు 50 శాతం మేర పెరగనున్నాయి. ఈ డీలిమిటేషన్ ద్వారా 2028 డిసెంబర్ లో జరగాల్సిన ఎన్నికలు ఆరు నెలలు వాయిదా పడనున్నాయి. ఈ సమయమే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం దక్కించుకోవటంలో కీలకంగా మారుతోంది. కాగా.. బీజేపీ ఇదే లక్ష్యంగా మొదలు పెట్టిన ఆపరేషన్ వెనుక భారీ వ్యూహం కనిపిస్తోంది.

డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగే తెలంగాణ లో అసెంబ్లీ- ఎంపీ సీట్లు 50 శాతం మేర పెరగనున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 50 శాతం పెంపు ప్రతిపాదన అమల్లోకి వస్తే రాష్ట్రంలో లోక్‌సభ సీట్ల సంఖ్య 26కు చేరుకుంటుంది. 182 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడతాయి. తొలుత ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఖరారు చేసి, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. పెరగనున్న 26 లోక్‌సభ స్థానాల్లో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ కింద 4 సీట్లు, ఎస్టీలకు 2 సీట్లు దక్కనున్నాయి. 17 స్థానాలు ఎస్సీలకు, 13 స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ అవుతాయి. 26 ఎంపీ సీట్లలో 6 స్థానాలు, 179 అసెంబ్లీ సీట్లలో ఏకంగా 60 స్థానాలు మహిళలకు దక్కనున్నాయి.

డీలిమిటేషన్ బిల్లు..నియోజకవర్గాల పెంపు ప్రక్రియ ఇలా - అక్కడే అసలు 'గేమ్'..!!
డీలిమిటేషన్ బిల్లు..నియోజకవర్గాల పెంపు ప్రక్రియ ఇలా - అక్కడే అసలు 'గేమ్'..!!
delimitation-bill-how-will-the-political-landscape-change-in-telangana-which-parties-could-benefit

ఆ ఆరు నెలల కాలమే కీలకం

కాగా, పునర్విభజనలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర జనాభాలో మూడింట ఒక వంతు ఉన్న జీహెచ్ఎంసీ, దాని చుట్టుపక్కల కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లతో పాటు హైదరాబాద్ శివార్లలోని మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోనే 50కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడే ఛాన్స్ కనిపిస్తోంది. కాగా.. 2028 డిసెంబర్ నాటికి ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి ముగియనుంది. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కారణంగా ఆరు నెలలు రాష్ట్రపతి పాలన విధించి 2029 లో ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారు. దీంతో.. ఆ ఆరు నెలల కాలమే రాజకీయంగా ఎన్నికల్లో గెలుపుకు కీలకంగా మారనుంది. వీటిని పరిగణలోకి తీసుకొని బీజేపీ పక్కా లెక్కతో ముందుకు వెళ్తోంది. దీంతో, రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలు. నిర్ణయాల పైన ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+