డీలిమిటేషన్ బిల్లు..నియోజకవర్గాల పెంపు ప్రక్రియ ఇలా - అక్కడే అసలు 'గేమ్'..!!

కేంద్రం మహిళా రిజర్వేషన్లు- డీలిమిటేషన్ బిల్లును ఆమోదించింది. ఈ నెల 30న ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రతిపాదించనున్నారు. 50 శాతం సీట్ల పెంపు ప్రతిపాదన తో పూర్తి మెజార్టీ సాధించి బిల్ ఆమోదం లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలు సైతం 50 శాతం మేర పెరగనున్నాయి. అయితే.. ఈ బిల్లు ఆమోదం తరువాత నియోజకవర్గాల పెంపు ప్రక్రియ.. తీసుకునే సమయం.. విధి విధానాల పైన అధికారులు స్పష్టత ఇస్తున్నారు.

పార్లమెంట్ లో కేంద్రం ప్రతిపాదించే మహిళా రిజర్వేషన్లు - డీలిమిటేసన్ బిల్లు ఆమోదం పొంద గానే అసలు ప్రక్రియ ప్రారంభం అవుతోంది. ఈ బిల్లు లక్ష్యంగా పూర్తి చేయాలంటే చట్టపరమైన - న్యాయ- సాంకేతిక ప్రక్రియ అవసరం. జనవరి నుంచి ఈ మేరకు కార్యాచరణ ప్రారంభం కానుంది. అందులో తొలి దేశంలోని కనీసం సగం రాష్ట్రాల శాసనసభలు సాధారణ మెజారిటీతో ఈ బిల్లును ఆమోదిస్తూ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన రాజ్యాంగ సవరణ కావడంతో ఈ ఆమోదం తప్పని సరి. అయితే, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఈ బిల్లు కు పూర్తిగా సహకరించనుండటంతో ఇందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం తో ఈ బిల్లు చట్టంగా మారుతుంది. చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అధ్యక్షతన అత్యున్నత స్థాయి డీలిమిటేషన్ కమిషన్ ను ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీనే నియోజకవర్గాల పునర్విభజన.. కొత్తవి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించనుంది.

ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపు, జిల్లాల వారీ లిస్టు - కూటమి Vs వైసీపీ.. అడ్వాంటేజ్ అక్కడే..!?
ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపు, జిల్లాల వారీ లిస్టు - కూటమి Vs వైసీపీ.. అడ్వాంటేజ్ అక్కడే..!?
delimitation-bill-legal-process-may-take-nearly-two-years-after-approval-here-the-report

కమిటీ సిఫారసుల మేరకే తుది నిర్ణయం

ఈ కమిటీలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్, ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. వీరితో ప్రతీ రాష్ట్రం నుంచి స్థానికంగా అయిదుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలను అసోసియేట్ మెంబర్లుగా నియమిస్తారు. ఈ కమిషన్ జనాభా లెక్కలు, భౌగోళిక స్వరూపం, పరిపాలనా సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త నియోజకవర్గాల సరిహద్దులను ఖరారు చేసే కసరత్తు పైన వీరు అందరి అభిప్రాయాలతో ముందుకు వెళ్తారు. కాగా, పునర్విభజన కోసం ఈ కమిటీ ప్రతీ జిల్లాలోనూ పర్యటించాల్సి ఉంటుంది. పంచాయితీ నుంచి పూర్తి స్థాయిలో జనాభా లెక్కలను విశ్లేషిస్తుంది. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను విభజిస్తూ కొత్త నియోజకవర్గాల ముసాయిదా ను రూపొందించి పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇందులోని ప్రతిపాదనల పైన రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, సామాన్య ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను స్వీకరిస్తారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల రొటేషన్ , మహిళా రిజర్వేషన్ల అమలు తుది నివేదికను రాష్ట్రపతికి సమర్పించటంతో.. తుది ఆమోదం లభించనుంది. ఈ మొత్తం ప్రక్రియ దాదాపు రెండేళ్ల సమయం పడుతుంది. అయితే, కమిషన్ తీసుకునే నిర్ణయాల పైన సూచనలు చేయటం మినహా.. న్యాయస్థానంలో సవాల్ చేసే అవకాశం ఉండదని స్పష్టం చేస్తున్నారు. దీంతో... 2029 ఎన్నికల నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేసే లక్ష్యంతో కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+