పార్టీలో చీలిక భయం, కేంద్రమంత్రి పదవి ఆశ: మోదీ మంత్రాంగం: ఎన్డీఏ చేరిక వైపు ప్రతిపక్ష పార్టీ

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఒకట్రెండు ప్రతిపక్ష, తటస్థ పార్టీలు కూడా బిల్లు వైపే మొగ్గు చూపుతోన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బిల్లుకు అనుకూలంగా ఓటు వేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) బిల్లుకు మద్దతు ఇవ్వనున్నట్లు అధికారికంగా వెల్లడించింది కూడా.

ఎన్సీపీ- ఎస్పీ తీసుకున్న ఈ నిర్ణయం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోంది. ఇది.. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు తెలపడంతోనే ఆగిపోదని, ఎన్డీఏ కూటమితో పొత్తు దిశగా ఈ పార్టీ చర్చలు జరుపుతోందనే ప్రచారం సైతం సాగుతోంది. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు ఎన్సీపీ- ఎస్పీ ప్రతిఫలాన్ని ఆశిస్తోందని చెబుతున్నారు. తమ షరతులను నెరవేర్చుకోవడానికి శరద్ పవార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

Sharad Pawar wants Union Cabinet Berth For Supriya Sule In Return Gift For Delimitation Bill Support

ఈ బేరసారాల్లో భాగంగా శరద్ పవార్ తమ పార్టీ తరఫున ప్రధాన డిమాండ్లను ముందుంచినట్లు సమాచారం. తన కుమార్తె, బారామతి ఎంపీ సుప్రియా సులేకు కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవాలని ఆయన కోరుతోన్నారు. దీంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వంలో కూడా తమ పార్టీకి రెండు కేబినెట్ బెర్తులను ఇవ్వాలని షరతు విధించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీఏలో చేరేలా ఈ పదవుల పంపిణీనే ప్రాతిపదికగా మార్చుకున్నారు.

డీలిమిటేషన్ పై కేంద్రానికి బిగ్ బ్రేక్ త్రూ: బిల్లుకు ఇండియా బ్లాక్ నుంచి ఫస్ట్ సపోర్ట్
డీలిమిటేషన్ పై కేంద్రానికి బిగ్ బ్రేక్ త్రూ: బిల్లుకు ఇండియా బ్లాక్ నుంచి ఫస్ట్ సపోర్ట్

ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో శరద్ పవార్ ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో ఫోన్ లో సంభాషించినట్లు తెలుస్తోంది. డీలిమిటేసన్ కు మద్దతు ప్రకటించడం వెనుక ఉన్న రాజకీయ అనివార్యతలు, సంక్లిష్ట పరిస్థితులను ఆయన వివరించినట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే పార్టీలో మరోసారి చీలిక వచ్చే ప్రమాదం ఉందని, ఉనికిని కాపాడుకోవడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని పవార్ స్పష్టం చేశారని చెబుతున్నారు.

అలాగైతేనే మద్దతిస్తాం- ఆపై మీ ఇష్టం: కేంద్రానికి స్టాలిన్ క్లియర్ మెసేజ్
అలాగైతేనే మద్దతిస్తాం- ఆపై మీ ఇష్టం: కేంద్రానికి స్టాలిన్ క్లియర్ మెసేజ్

ఇప్పటికే అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ వర్గం మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంలో బీజేపీతో కలిసి అధికారంలో కొనసాగుతోంది. ఒకవేళ శరద్ పవార్ వర్గం కూడా ఎన్డీఏ వైపు అడుగులు వేస్తే.. రాష్ట్ర రాజకీయ చిత్రపటం ఊహించని మలుపు తిరుగుతుంది. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ పార్టీ భవిష్యత్తు, క్యాడర్ ను కాపాడుకోవడానికి శరద్ పవార్ తన దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని భావిస్తున్నారు.

కేంద్రానికి మళ్లీ జగన్ అవసరం వచ్చింది.. !!
కేంద్రానికి మళ్లీ జగన్ అవసరం వచ్చింది.. !!

కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల తరబడి అనుబంధం ఉన్న శరద్ పవార్.. ఇండియా కూటమికి స్వస్తి చెప్పి ఎన్డీఏ వైపు మొగ్గు చూపడం ప్రతిపక్ష కూటమికి కోలుకోలేని దెబ్బ కావొచ్చు. రాబోయే రోజుల్లో కేంద్రంలో సుప్రియా సులేకు మంత్రిపదవి దక్కడం, మహారాష్ట్ర కేబినెట్‌లో స్థానం లభించడంపై అధికారిక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలు మహారాష్ట్రతో పాటు జాతీయ రాజకీయాల్లో సరికొత్త అధికార సమీకరణాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+