నేచురల్ స్టార్ నాని, నవీన్ పొలిశెట్టి బాటలో కుర్ర హీరో!

'జిగ్రీస్' సినిమాకు ముందు రెండు మూడు చిత్రాల్లో నటించినా, ఆ సినిమా రిలీజ్ తర్వాతే అసలైన గుర్తింపును అందుకున్నాడు యంగ్ హీరో కృష్ణ బూరుగుల. పక్కింటి కుర్రాడిలా ఎంతో సహజమైన నటనతో, తన కామెడీ టైమింగ్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ క్రేజ్ తెచ్చుకోవడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు, ప్రతిష్టాత్మక అవార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

'బాహుబలి 2’ రికార్డును 'రామాయణ' బద్ధలు కొడుతుందా? అడుగు దూరంలో ఉంది!
'బాహుబలి 2’ రికార్డును 'రామాయణ' బద్ధలు కొడుతుందా? అడుగు దూరంలో ఉంది!

ఆఫర్లు వెల్లువెత్తుతున్నా.. ఆచితూచి అడుగులు!
'జిగ్రీస్' సినిమా విజయం తర్వాత కృష్ణ బూరుగులకు వరుసగా ఆఫర్లు తలుపుతడుతున్నాయి. అయితే సక్సెస్ వచ్చింది కదా అని కంగారుపడి దొరికిన ప్రతి సినిమాకు సైన్ చేయడం లేదు ఈ కుర్ర హీరో. "ఆకలిగా ఉన్నా సరే.. తొందరపడకూడదు"అన్నట్లుగా, 10 రొటీన్ సినిమాలు చేసి కనుమరుగయ్యే కంటే.. నిలబడి నాలుగు సినిమాలు చేసినా కాలర్ ఎగరేసి చెప్పుకునేలా ఉండాలని ఫిక్స్ అయ్యాడు. నేచురల్ స్టార్ నాని, నవీన్ పోలిశెట్టి బాటలో.. కేవలం కథకు, తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడు. తెరపై నటించడం కంటే ఆ పాత్రలా జీవించడానికే ఎక్కువ ఇష్టపడే కృష్ణ, తన తర్వాతి సినిమాల విషయంలోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.

Young Hero Krishna Burugula Following Nani Naveen Polishetty Path Cautious Moves and Crazy Project Ahead

త్వరలోనే క్రేజీ అనౌన్స్‌మెంట్!
ప్రస్తుతం కృష్ణ బూరుగుల లైనప్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఓ యూనిక్ స్టోరీ పాయింట్‌తో, కడుపుబ్బా నవ్వించే అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌తో త్వరలోనే ఒక క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది. దీంతో పాటు మరో కొన్ని ఆసక్తికరమైన కథలు చర్చల దశలో ఉన్నాయి.

ఇలాంటి కథ ఇప్పటివరకు చూడలేదు.. టాలీవుడ్‌లో మరో డిఫరెంట్ మూవీకి శ్రీకారం!
ఇలాంటి కథ ఇప్పటివరకు చూడలేదు.. టాలీవుడ్‌లో మరో డిఫరెంట్ మూవీకి శ్రీకారం!

సరైన స్టోరీ కనుక తన వద్దకు చేరితే, తన సహజమైన నటనతో ప్రేక్షకులను మరోసారి కడుపుబ్బా నవ్వించి, మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు తెరకు దొరికిన ఈ నేచురల్ టాలెంట్, తన క్వాలిటీ సినిమాలతో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు కుర్ర హీరో కృష్ణ బూరుగుల.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+