జగన్ పాదయాత్రకు పోటీగా షర్మిల బిగ్ ప్లాన్, అక్కడే ఢిల్లీ బిగ్ ట్విస్ట్..!?
ఏపీలో రాజకీయం ఆసక్తిగా మారుతోంది. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. డీలిమిటేషన్ తో రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెరుగుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తో పార్టీలు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. పెరిగిన స్థానాలతోనే 2029 ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఈ ఎన్నికల కోసం ఇప్పటికే నుంచి ప్రణాళికలు రచిస్తున్నారు. జగన్ పాదయాత్ర పైన ఇప్పటికే ప్రకటన చేసారు. కాగా.. ఈ సమయంలోనే షర్మిల కొత్త వ్యూహం రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది.
మాజీ సీఎం జగన్ 2029 ఎన్నికలే లక్ష్యంగా పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. 2019 ఎన్నికల ముందు చేసిన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3,648 కిలో మీటర్లు యాత్ర చేసారు. 2024 ఎన్నికల్లో ఓడిన తరువాత పరామర్శలు.. భరోసా యాత్రలకే పరిమితం అయ్యారు. కాగా, 2027 సెప్టెంబర్ నుంచి తన పాదయాత్ర ఉంటుందని జగన్ ఇప్పటికే ప్రకటించారు. తాజా గా మారుతున్న సమీకరణాలతో 2027 మార్చి నుంచే పాదయాత్ర ప్రారంభించాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాను పాదయాత్ర చేస్తానని కొత్తగా పార్టీ ప్రారంభించిన మాజీ వైసీపీ నేత విజయ సాయిరెడ్డి ప్రకటించారు. జగన్ పాదయాత్ర 2028 డిసెంబర్ వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన సైతం జరుగుతుండటం.. అసెంబ్లీ సీట్ల పెంపుతో 2029 ఎన్నికలు రాజకీయంగా మరింత ఆసక్తిగా మారుతున్నాయి.

షర్మిలకు పీసీసీ పదవి తిరిగి కొనసాగించేనా..!
అయితే, ఇప్పుడు జగన్ పాదయాత్ర సమయంలోనే పీసీసీ చీఫ్ షర్మిల సైతం రాష్ట్ర వ్యాప్తంగా తన పార్టీ బలోపేతం కోసం పాదయాత్రకు సిద్దం అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. షర్మిల వైసీపీలో ఉన్న సమయంలో 2012 లో 14 జిల్లాల్లో 107 అసెంబ్లీ నియోజకవర్గాల్లో షర్మిల యాత్ర కొనసాగింది. తెలంగాణలోనూ ద్వారా సుమారు 3,800 కిలోమీటర్లు నడిచారు. అయితే, వచ్చే జనవరి కి షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి మూడేళ్ల కాలం పూర్తవుతుంది. ఈ పదవిలోకి వచ్చిన తరువాత షర్మిల పార్టీ కోసం ఏం చేసారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జగన్ పైన విమర్శలు మినహా.. పార్టీకి మేలు చేసే కార్యాచరణ లేదనే ఫిర్యాదు లు ఉన్నాయి. అయితే.. అసలు షర్మిల కు తిరిగి పదవి రెన్యువల్ అవుతుందా.. తప్పిస్తారా అనేది స్పష్టత వచ్చిన తరువాతనే పాదయాత్ర పైన నిర్ణయం ఉంటుందని పార్టీ నేతల సమాచారం.













Click it and Unblock the Notifications
