ఒలింపిక్ అసోసియేషన్ పగ్గాలు ఎవరికి? అధ్యక్ష బరిలో రాజీవ్ మెహతా!

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీకి చెందిన ప్రముఖ క్రీడా నిర్వాహకుడు రాజీవ్ మెహతా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. 2026 డిసెంబర్ 5న జరగనున్న ఈ ఎన్నికల్లో ఆయన గగన్ నారంగ్, వీరేంద్ర సచ్‌దేవాలతో పోటీ పడుతున్నారు. దశాబ్ధాల పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పరిపాలనలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.

 విజయ్ కోసం కాంగ్రెస్ నిర్ణయమే మోదీకి వరంగా - డీలిమిటేషన్, 2029 కు లైన్ క్లియర్..!!
విజయ్ కోసం కాంగ్రెస్ నిర్ణయమే మోదీకి వరంగా - డీలిమిటేషన్, 2029 కు లైన్ క్లియర్..!!

ఐఓఏ అధ్యక్ష రేసు.. ప్రధాన పోటీదారుగా రాజీవ్ మెహతా
ఐఓఏ అత్యున్నత పదవి కోసం జరగనున్న ఎన్నికలపై క్రీడా వర్గాల్లో ఆసక్తి నెలకొంది. జాతీయ క్రీడా సమాఖ్యలను మరింత బలోపేతం చేయడం.. దేశంలో ఒలింపిక్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం ప్రధాన లక్ష్యాలుగా రాజీవ్ మెహతా బరిలోకి దిగారు. ఎనిమిదేళ్ల పాటు ఐఓఏ ప్రధాన కార్యదర్శిగా, ఆసియా క్రీడల నిర్వహణలో ఆయన సంపాదించిన అనుభవం ఈ ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Rajeev Mehta Files Nomination for IOA President Post December 5 Election Against Gagan Narang Full Details

ఉత్తరాఖండ్ నుంచి జాతీయ స్థాయి వరకు ప్రస్థానం
రాజీవ్ మెహతా క్రీడా పరిపాలన ప్రస్థానం ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచే ప్రారంభమైంది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆయన ఉత్తరాఖండ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే ఉత్తరాఖండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్, ఖో-ఖో పెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. హాకీ ఇండియాకు అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన రాజీవ్ మెహతా.. రాష్ట్ర స్థాయిలో ఆర్జించిన అనుభవంతో క్రమంగా జాతీయ ఒలింపిక్ సంస్థలో కీలక స్థానానికి ఎదిగారు.

వైభవ్ బ్యాట్‌లో ఎన్విడియా ఏఐ చిప్స్? వైరల్ అవుతున్న ఫన్నీ పోస్ట్!
వైభవ్ బ్యాట్‌లో ఎన్విడియా ఏఐ చిప్స్? వైరల్ అవుతున్న ఫన్నీ పోస్ట్!

ఎనిమిదేళ్ల పాటు ఐఓఏ సెక్రటరీ జనరల్‌గా సేవలు
2014లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్‌గా ఎన్నికవడం రాజీవ్ మెహతా కెరీర్లో కీలక మైలురాయిగా నిలిచింది. 2014 నుంచి 2022 వరకు వరుసగా ఎన్నిమిదేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఆ కాలంలో జాతీయ క్రీడా సమాఖ్యలు, రాష్ట్ర ఒలింపిక్ సంఘాలు, అంతర్జాతీయ క్రీడా సంస్థలతో సమన్వయం చేస్తూ ఒలింపిక్ పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించారు. ఈ సుదీర్ఘ అనుభవం ఆయనను అధ్యక్ష పదవికి బలమైన అభ్యర్థిగా నిలబెట్టింది.

ఫెన్సింగ్, ఆసియా క్రీడల రంగంలో విస్తృత అనుభవం
ఆసియా క్రీడల నిర్వహణలోనూ రాజీవ్ మెహతా తనదైన ముద్ర వేశారు. 2024 డిసెంబర్లో ఆయన ఫెన్సింగ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆసియా సెక్రటరీ జనరల్‌గా ఎన్నికయ్యారు. 40కి పైగా దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సమాఖ్యకు ఆయన 2024 నుంచి 2028 వరకు సెక్రటరీ జనరల్‌గా వ్యవహరించనున్నారు. అంతే కాకుండా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్‌గా కూడా ఆయన ఉన్నారు. దేశంలోనూ, ఆసియా స్థాయిలోనూ ఫెన్సింగ్ క్రీడాభివృద్ధి, నిర్వహణలో ఆయనకున్న అనుభవం రాజీవ్ మెహతా పరిపాలనా నైపుణ్యానికి అద్ధం పడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+