డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు పై బీఆర్ఎస్ ఊహించని నిర్ణయం, మారుతున్న లెక్కలు..!!
డీలిమిటేషన్ బిల్లు వేళ తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్లమెంట్ లో కేంద్రం మహిళా రిజర్వేషన్లు - డీలిమిటేషన్ బిల్లు ప్రతిపాదించేందుకు సిద్దమైంది. డీఎంకే, ఎన్సీపీ సైతం మద్దతు ప్రకటించటంతో ఈ బిల్లు ఆమోదం లాంఛనంగా కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ సైతం ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించింది. కాగా, ఇప్పుడు బీఆర్ఎస్ ఈ బిల్లు విషయంలో తమ వైఖరి తేల్చి చెప్పింది. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారుతోంది.
డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెడుతున్న వేళ పార్టీలు స్పందిస్తున్నాయి. ఇండియా కూటమి ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. డీఎంకే, ఎన్సీపీ పవార్ వర్గం తమ మద్దతు తెలిపాయి. అటు టీఎంపీ, ఆప్ చీలక వర్గాల ఎంపీలు సైతం అనుకూలంగా ఓటింగ్ చేయటం ద్వారా ఈ బిల్లు ఆమోదం ఇక లాంఛనమే అనే అభిప్రాయ వినిపిస్తోంది. కాగా.. తెలంగాణలో నెల కొన్న రాజకీయ పరిస్థితుల వేళ ఈ బిల్లు విషయంలో బీఆర్ఎస్ నిర్ణయం ఆసక్తిగా మారుతోంది. లోక్ సభలో బీఆర్ఎస్ కు ఎంపీలు లేరు. రాజ్యసభలో ముగ్గురు ఉన్నారు. ఈ సమయంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ వైఖరి ప్రకటించారు. దక్షిణ భారత రాష్ట్రాల పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో ఎలాంటి తగ్గుదల ఉండకూడదని, తెలంగాణకు జరిగే ఏ అన్యాయాన్నీ సహించబోమని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ తాాజా నిర్ణయంతో
Our stand on Delimitation has always been clear:No reduction in South India's parliamentary representation. No injustice to Telangana will be tolerated We have consistently demanded that the South's existing 24% share in parliament be protected.The proposed 50% increase in seats, with a safeguard against altering the inter-state representation ratio until 2051, addresses this key concern while increasing Telangana's Lok Sabha seats from 17 to 26.Keeping Telangana's interests paramount, our three Rajya Sabha MPs will vote in favour of the proposal.We have always supported women's reservation and remain committed to its implementation.
— KTR (@KTRBRS) November 28, 2026
అదే విధంగా పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న 24 శాతం ప్రాతినిధ్య వాటాను కాపాడాలని తాము నిరంతరం డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. 2051 వరకు అంతర్రాష్ట్ర ప్రాతినిధ్య నిష్పత్తి మారకుండా రక్షణ కల్పిస్తూ, లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచాలన్న ప్రతిపాదనకు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన అమలైతే తెలంగాణలో లోక్‌సభ స్థానాలు ప్రస్తుత 17 నుంచి 26కు పెరుగుతాయని వివరించారు. తెలంగాణ ప్రయోజనా లే పరమావధిగా తమ ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేస్తారని కేటీఆర్ వెల్లడించారు. మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిందని, వాటి అమలుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దీంతో... రాజ్యసభలో బీఆర్ఎస్ డీలిమిటేషన్ బిల్లు కు మద్దతుగా నిలవాలనే నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications
