స్కూల్ వద్ద భారీ పేలుడు.. పలువురు విద్యార్థులు దుర్మరణం, 97 మందికి గాయాలు!

తూర్పు అఫ్గానిస్తాన్‌లోని కునార్ ప్రావిన్స్‌లో శనివారం ఉదయం జరిగిన భారీ పేలుడు తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ మిడిల్ స్కూల్ పక్కన ఉన్న ఇంట్లో శనివారం జరిగిన పేలుడులో దాదాపు 6గురు విద్యార్థులు మృతి చెందగా.. మరో 97 మంది గాయపడినట్లు సమాచారం. మైనింగ్ కార్యకలాపాల్లో పాల్గొనే వ్యక్తులు ఆ ఇంట్లో డైనమైట్ నిల్వ ఉంచడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కునార్ ప్రావిన్షియల్ ఆస్పత్రి అధిపతి మౌలా దాద్ స్పందిస్తూ.. మృతులు, క్షతగాత్రుల సంఖ్య ప్రస్తుతం ప్రాథమికమైనదని తెలిపారు. పేలుడు తీవ్రత దృష్ట్యా మరిన్ని వివరాలు అందిన తర్వాత మృతుల సంఖ్య మారే అవకాశం ఉందని.. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన వెల్లడించారు.

రైల్వే స్టేషన్‌లో దారుణం: మరుగుదొడ్డిలోకి చొరబడి 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!
రైల్వే స్టేషన్‌లో దారుణం: మరుగుదొడ్డిలోకి చొరబడి 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!

మిడిల్ స్కూల్ పక్కనే ఉన్న ఇంట్లో పేలుడు
కునార్ ప్రావిన్స్‌లోని ఆండర్ సెర్ ప్రాంతంలో ఉన్న మిడిల్ స్కూల్ సమీపంలోని ఓ ఇంట్లో శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. పాఠశాల వేళల్లోనే ఈ ఘటన జరగడంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రావిన్స్ సమాచార, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మౌలవీ సమి-ఉల్-హక్ ధ్రువీకరించారు.

Explosion Near School in Afghanistan Kills 6 Students Injures 97 Probe Underway Full Details Here

డైనమెట్ నిల్వపై అనుమానాలు
మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులకు చెందిన ఇంట్లో డైనమైట్ నిల్వ చేశారని సమి-ఉల్-హక్ వెల్లడించారు. జనసంచారం.. ముఖ్యంగా పాఠశాల ఉన్న ప్రాంతం సమీపంలోనే పేలుడు పదార్థాలను ఎలా, ఎందుకు నిల్వ ఉంచారనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుడుకు దారితీసిన కచ్చితమైన పరిస్థితులపై ఆయన మరిన్ని వివరాలను వెల్లడించలేదు.

14 ఏళ్లకే పెళ్లి.. ప్రసవం తర్వాత భర్త చేతిలో దారుణ హత్య!
14 ఏళ్లకే పెళ్లి.. ప్రసవం తర్వాత భర్త చేతిలో దారుణ హత్య!

దర్యాప్తు ముమ్మరం
పాకిస్థాన్‌తో సరిహద్దును పంచుకునే కునార్ ప్రావిన్స్ లో జరిగిన ఈ ఘటన అనంతరం దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పేలుడుకు గల పూర్తి కారణాలు, జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం తీవ్రతపై దర్యాప్తు పూర్తియిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

గతంలో జరిగిన ఘటన
ఆఫ్ఘనిస్తాన్ లో పాఠశాలల వద్ద పిల్లల భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. గత ఆగస్టులో రాజధాని కాబూల్ లోని ఓ స్కూల్ కాంప్లెక్స్ వద్ద హ్యాండ్ గ్రెనేడ్ దాడి జరిగింది. ఆ ఘటనలో 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న 40 మందికి పైగా చిన్నారులు గాయపడిన సంగతి తెలిసిందే. తాజా పేలుడు ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+