తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు ఇక - టీటీడీ కీలక నిర్ణయం..!!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కంపార్ట్ మెంట్లు నిండిపోయి బయట శిలా తోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం భక్తులకు 18 గంటల సమయం తీసుకుంటోంది. అటు వైకుంఠ ద్వార దర్శనం కోసం దర్శనాల పైన టీటీడీ మరో నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో కాలి నడకన అలిపిరి, మెట్ల మార్గంలో వచ్చే భక్తుల విషయంలో టీటీడీ కీలక సూచనలు చేస్తోంది.
టీటీడీ భక్తుల సదుపాయాల పైన ప్రత్యేకంగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా తిరుమల కు కాలినడకన వచ్చే భక్తులు అలిపిరి, శ్రీవారిమెట్ల మార్గంలో మెట్ల పూజకు నాణ్యమైన పసుపు, కుంకుమ వినియోగించేలా చర్యలు చేపట్టాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారుల ను ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో శనివారం టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అలిపిరి వద్ద పూజ సామాగ్రి విక్రయాల్లో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నడక మార్గంలో భక్తులు జారి పడకుండా నాణ్యమైన పసుపు, కుంకుమను మాత్రమే విక్రయించేలా నిబంధనలు కఠినతరం చేయాలని చెప్పారు. ఈ మేరకు సూచిక బోర్డుల ఏర్పాటు చేసి విస్తృతంగా అవగాహన కల్పించాలి అని వెంకయ్య చౌదరి నిర్దేశించారు.

టీటీడీ తాజా నిర్ణయాలతో
శ్రీవారి ఆలయంలో డిసెంబరు 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి వివిధ దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల తేదీలను ఇప్పటికే ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వైకుంఠం ద్వార దర్శనం పది రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు తప్ప మరే ఇతర సేవలు ఉండవని ఇప్పటికే ప్రకటించారు. ఈ రోజు శ్రీవాణి కోటా టికెట్లు విడుదల చేసిన వెంటనే నిమిషాల్లో పూర్తయ్యాయి. కాగా.. 30వ తేదీన ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనాల్లో సామాన్యులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే విధంగా వైకుంఠ ఏకాదశి తొలి రెండు రోజుల్లో ప్రోటోకాల్ ప్రముఖులు స్వయంగా వస్తే మినహా ఎలాంటి వీఐపీ సిఫారసు లేఖలు.. దర్శనాలు అనుమతించమని టీటీడీ స్పష్టం చేసింది.













Click it and Unblock the Notifications
