Vrushakarma First Review: అక్కినేని నాగ చైతన్య 'వృషకర్మ' మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే..!

టాలీవుడ్ లో మాస్టర్ స్టోరీ టెల్లర్ గా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుల్లో సుకుమార్ ఒకరు. అయితే ఇండస్ట్రీలో ఆయన శిష్యులు చాలామందే ఉన్నారు. వారిలో టాలీవుడ్ యువ దర్శకుడు కార్తిక్ దండు ఒకరు. చాలా ఏళ్లపాటు సుకుమార్ డైరెక్షన్ టీమ్ లో పనిచేసిన ఆయన 2023 లో 'విరూపాక్ష' అనే సినిమాతో దర్శకుడిగా మారారు. సుప్రీమ్​ స్టార్​ సాయిదుర్గ తేజ్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. విభిన్న కథలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని 'విరూపాక్ష' సినిమా రుజువు చేసింది. ఈ సినిమాలో సాయి దుర్గ​ తేజ్​ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించారు. ఇక తేజ్ కెరీర్‌ లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా విరూపాక్ష నిలిచింది.

ఇక కార్తిక్ దండు దర్శకుడిగా అక్కినేని నాగచైతన్య హీరోగా ప్రస్తుతం 'వృషకర్మ' అనే సినిమా రాబోతుంది. విరూపాక్ష తర్వాత మరో విభిన్నమైన కథతో ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు దర్శకుడు కార్తిక్ దండు సిద్ధంగా ఉన్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. నాగ చైతన్య 24వ చిత్రంగా వస్తున్న వృషకర్మ మూవీపై అటు అక్కినేని ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రేక్షకుడు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ట్రైలర్ ప్రకారం ఈ మూవీలో నాగచైతన్య 'అర్జున్' అనే ట్రెజర్ హంటర్ క్యారెక్టర్​ లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 50 నిమిషాలు ఉన్నట్లు ఇటీవల మేకర్స్ స్వయంగా తెలిపారు. అందులో దాదాపు ప్రతి ఫ్రేమ్​ లో వీఎఫ్​ ఎక్స్ ఉంటుందని స్పష్టం చేశారు. ఇక ఈ మూవీలో 'దక్ష' క్యారెక్టర్​ లో హీరోయిన్ మీనాక్షి చౌదరి, ప్రొఫెసర్ రంగనాథ్​ గా సీనియర్ నటుడు జయరామ్ కనిపిస్తున్నారు.

Vrushakarma first review of Akkineni Naga Chaitanya latest film a worldwide release on December 4th

ఈ మూవీ డిసెంబర్ 4 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సుకుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్‌ లోక్‌ నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇటీవల వృషకర్మ ప్రివ్యూ షో ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో డిస్ట్రిబ్యూటర్స్ కోసం ప్రదర్శించారు. వాళ్ల నుంచి వచ్చిన టాక్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వృషకర్మ ఫస్టాఫ్ థ్రిల్లింగ్ అంశాలతో ట్విస్టులతో ముడిపడి ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఓ మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ తో ఇంటర్వెల్ ఉంటుందని చెబుతున్నారు. అలాగే సెకండాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ నెవర్ బిఫోర్ రేంజ్ లో ఉంటాయని.. వీటితోపాటు ప్రీ క్లైమాక్స్ లో ట్విస్ట్.. హారర్ ఎలిమెంట్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని ఓవరాల్ గా అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో తండేల్ తర్వాత మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం అని మాట్లాడుకుంటున్నారు. మరి ఫుల్ రివ్యూ కోసం డిసెంబర్ 4 వరకు వేచి చూడాల్సిందే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+