డీలిమిటేషన్ తో జెర్రీ మాండరింగ్..! బీజేపీ గేమ్ ప్లాన్ బయటపెట్టిన కాక్రోచ్ పార్టీ..!

దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన కోసం గతంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా డీలిమిటేషన్-మహిళా బిల్లుల్ని తీసుకొచ్చిన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. వాటిని నెగ్గించుకోవడంలో మాత్రం విఫలమైంది. దీంతో వచ్చే వారం మరోసారి ఈ బిల్లుల్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి నెగ్గించుకోవాలని చూస్తోంది. దీనికి గతంలో వ్యతిరేకించిన ఎన్సీపీ, డీఎంకే, తృణమూల్ చీలిక వర్గం వంటి కొన్ని విపక్షాలు ఈసారి మద్దతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లుతో బీజేపీ జెర్రీ మాండరింగ్ గేమ్ మొదలుపెట్టిందని కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) ఆరోపించింది.

డీలిమిటేషన్ బిల్లు పాసైతే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెరిగే సీట్లు ఇవే..!
డీలిమిటేషన్ బిల్లు పాసైతే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెరిగే సీట్లు ఇవే..!

దీంతో బీజేపీ జెర్రీ మాండరింగ్ (నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి గీయడం) గేమ్ వల్ల లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందని కాక్రోచ్ పార్టీ ఓ ప్రకటనలో ఆరోపించింది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనలో రాజకీయ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తే ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం జరుగుతుందని సీజేపీ హెచ్చరించింది. డీలిమిటేషన్ ప్రక్రియలో ఎంపీ, ఎమ్మెల్యే స్ధానాల్ని అధికార పార్టీకి అనుకూలంగా మార్చే ప్రమాదం ఉందని రాజకీయ పార్టీల్ని కాక్రోచ్ పార్టీ హెచ్చరించింది.

Cockroach Janta Party Opposes Delimitation Bill Warns of Gerrymandering to Benefit BJP

డీలిమిటేషన్ వల్ల ఎన్నికల పోలింగ్ బూత్ ల వారీగా ఫలితాలు, ఓటర్ల జాబితాలు, గత ఎన్నికల ఓటింగ్ సరళిని వాడుకుని నియోజకవర్గాల సరిహద్దుల్ని ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా రూపొందించే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఒక పార్టీకి మద్దతుగా ఉన్న ఓటర్లను ఒకే నియోజకవర్గంలో కేంద్రీకరించడం, మరికొన్ని ప్రాంతాల్లో వారిని వేర్వేరు నియోజకవర్గాలుగా విభజించడం ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయొచ్చని వివరించింది. మొత్తం పోలైన ఓట్లలో మార్పు లేకపోయినా నియోజకవర్గాల సరిహద్దుల మార్పులతో రాజకీయ ఫలితాలు మారే అవకాశం ఉందని తెలిపింది. సరైన రక్షణ చర్యలు, స్వతంత్ర పర్యవేక్షణ లేకపోతే ఈ ప్రక్రియ బీజేపీకి దీర్ఘకాలికంగా రాజకీయ ప్రయోజనం కల్పించేలా మారొచ్చని సీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. డీలిమిటేషన్ ప్రక్రియను జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం నిర్వహిస్తే, దీనిపై ప్రజల్లో విశ్వాసం కలగదని తెలిపింది.

Cockroach Janta Party Opposes Delimitation Bill Warns of Gerrymandering to Benefit BJP
కేంద్రమంత్రికి కాక్రోచ్ నేత భారీ షాక్..! 3 కోట్ల పరువునష్టం నోటీసు..!
కేంద్రమంత్రికి కాక్రోచ్ నేత భారీ షాక్..! 3 కోట్ల పరువునష్టం నోటీసు..!

దేశవ్యాప్తంగా ఎంపీ స్ధానాలు 50 శాతం పెరుగుతాయనే కారణంతో కొన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతునిస్తున్నాయని, కానీ జెర్రీమాండరింగ్ ప్రమాదాన్ని అవి గుర్తించడం లేదని వివరించింది. ఇందుకు అసోంలో సరిహద్దుల మార్పుల్ని ఉదాహరణగా చూపింది. బీజేపీ రాజకీయ వ్యూహాలకు పరోక్షంగా మద్దతిచ్చేలా విపక్షాలు వ్యవహరిస్తే అది ప్రజలకు చేసే తీవ్రమైన ద్రోహమని తెలిపింది. విపక్షాల సిద్దాంతాలు లేని రాజకీయాలకు భవిష్యత్తులో యువత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మహిళా రిజర్వేషన్లకు తాము మద్దతు ఇస్తున్నామని, కానీ ఆ పేరుతో జరిగే డీలిమిటేషన్ కు వ్యతిరేకమని సీజేపీ తెలిపింది. కాబట్టి రాజకీయ పార్టీలు రాజ్యాంగ విలువల కంటే స్వార్ధ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తే భవిష్యత్ తరాలు దీని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాబట్టి పార్లమెంట్ లో డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని అన్ని రాజకీయ పార్టీల్ని సీజేపీ కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+