కేంద్రమంత్రికి కాక్రోచ్ నేత భారీ షాక్..! 3 కోట్ల పరువునష్టం నోటీసు..!
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కు ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేత అశుతోష్ రాంగా బిగ్ షాకిచ్చారు. ఆయనకు 3 కోట్ల రూపాయల పరువునష్టం నోటీసులు పంపారు. గతంలో నీట్ అక్రమాలపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ నేతలతో చర్చలు జరిపిన జితేంద్ర సింగ్.. తాజాగా అదే నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపైనే ఇప్పుడు సీజేపీ నేత అశుతోష్ ఆయనకు పరువునష్టం నోటీసులు ఇచ్చారు.
పాకిస్తాన్ నుంచి నిధులు అందుకున్నానంటూ తనపై చేసిన హేయమైన వ్యాఖ్యలకు గానూ.. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కు తాను ఈ మేరకు లీగల్ నోటీసు పంపినట్లు అశుతోష్ రాంకా ట్వీట్ చేశారు. ఈ అహంకారపూరిత, చదువులేని రాజకీయ నాయకుల పిల్లల్లా కాకుండా, తాను ఐఐటి కాన్పూర్ , లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ప్రవేశం పొందడానికి చాలా కష్టపడ్డానన్నారు. తన దేశానికి సేవ చేయడానికి తిరిగి రావడం కోసం, తాను మెకిన్సీలో అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని, లండన్‌లోని సుఖవంతమైన జీవితాన్ని వదులుకున్నానని గుర్తుచేసుకున్నారు.

🚨#ImportantAnnouncement🚨I have sent a legal notice to @DrJitendraSingh for his obnoxious remarks on me saying that I had received “funds from Pakistan”.Unlike the kids of these arrogant and uneducated politicians, I worked hard to get into IIT Kanpur and London School of Economics. I gave up on a high-paying job at McKinsey and a comfortable life in London to come back and serve my country. I have toiled hard in public life for the last two years to raise issues that matter to the people of India. All my professional engagements with McKinsey, GAVI and other organisations have been well documented and are duly in compliance with the tax and accounting laws of India. Interestingly enough, the Govt of India happens to have great personal and professional relations with these organisations, including an ongoing donation of mn to GAVI.I will not tolerate the likes of Jitendra Singh questioning my integrity and love for the nation. India is all I live for and India is all I will die for.
— Ashutosh Ranka (@AshutoshRanka) November 27, 2026
భారతదేశ ప్రజలకు ముఖ్యమైన సమస్యలను లేవనెత్తడానికి గత రెండు సంవత్సరాలుగా తాను ప్రజా జీవితంలో తీవ్రంగా శ్రమించానని అశుతోష్ తెలిపారు. మెకిన్సీ, గావి (GAVI) ఇతర సంస్థలతో తనకున్న వృత్తిపరమైన ఒప్పందాలన్నీ పక్కాగా నమోదు చేయబడ్డాయని ఆయన వెల్లడించారు. భారతదేశ పన్ను, అకౌంటింగ్ చట్టాలకు అనుగుణంగా అవి ఉన్నాయన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గావి (GAVI)కి ప్రస్తుతం అందిస్తున్న 20 మిలియన్ డాలర్ల విరాళంతో సహా, భారత ప్రభుత్వానికి ఈ సంస్థలతో గొప్ప వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలు ఉన్నాయన్నారు. జితేంద్ర సింగ్ వంటి వారు తన నిజాయితీని, దేశభక్తిని ప్రశ్నించడాన్ని తాను సహించబోనన్నారు. తాను బ్రతికేది భారతదేశం కోసమే అని, చనిపోయేది కూడా భారతదేశం కోసమేనని అశుతోష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జితేంద్ర సింగ్ తన ఆరోపణల్ని వెంటనే వెనక్కి తీసుకోవడంతో పాటు తనకు క్షమాపణ చెప్పాలని, 3 కోట్లు పరిహారంగా చెల్లించాలని, లేకపోతే వాటిని ఆధారాలతో నిరూపించాలని అశుతోష్ ఆయనకు సవాల్ విసిరారు.













Click it and Unblock the Notifications
