IPL 2027: హార్దిక్‌కు గుడ్‌బై.. రోహిత్‌కు మళ్లీ జై! ముంబై ఇండియన్స్ బిగ్ డెసిషన్!
IPL 2027: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ తిరిగి కెప్టెన్‌గా నియమితులయ్యారు. హార్దిక్ పాండ్యాను పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ చేసిన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ముంబై ఫ్రాంచైజీ ఈ కీలక ప్రకటన చేసింది. 2013 నుంచి 2023 వరకు ముంబై ఇండియన్స్ జట్టును విజయవంతంగా నడిపించి 5 టైటిళ్లు అందించిన రోహిత్ శర్మ.. 2027 సీజన్‌తో మరోసారి కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. 2024 ఐపీఎల్ సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించగా.. తాజా పరిణామాలతో మళ్లీ రోహిత్ శర్మకు నాయకత్వ బాధ్యతలు దక్కాయి.
హార్దిక్ ట్రేడ్.. అర్ష్‌దీప్ సింగ్ రాక
రానున్న ఐపీఎల్ 2027 సీజన్ కోసం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఆసక్తికరమైన ఆటగాళ్ల మార్పిడి జరిగింది. హార్దిక్ పాండ్యాను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి ట్రేడ్ చేయగా.. బదులుగా భారత స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చారు. అర్ష్‌దీప్ సింగ్ తన ప్రస్తుత వేతనం రూ.18 కోట్లతో ముంబై ఇండియన్స్‌లో చేరారు. జస్ప్రీత్ బుమ్రాతో కలిసి బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఇది దోహదపడనుంది. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి మారిన హార్దిక్ పాండ్యా వేతనం రూ.16.35 కోట్ల నుంచి రూ.18 కోట్లకు పెరిగింది.

రిటెన్షన్ జాబితా.. మినీ వేలం పర్స్
మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ మొత్తం 16 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. ఫ్రాంచైజీ వద్ద ఇంకా 9 ఖాళీ స్థానాలు, రూ.32.60 కోట్ల వేలం పర్స్ మిగిలి ఉన్నాయి. కెప్టెన్ తో పాటు పటిష్టమైన కోర్ జట్టు.. మిగిలిన రూ.32.60 కోట్ల పర్స్‌తో మినీ వేలంలో అవసరమైన ఆటగాళ్లను ఎంపిక చేసుకుని.. ఐపీఎల్ 2027 సీజన్‌కు సమతూకమైన జట్టును తీర్చిదిద్దాలని ముంబై ఇండియన్స్ లక్ష్యంగా పెట్టుకుంది.
ముంబై ఇండియన్స్ రీటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే..
రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్, నమన్ ధీర్, అశ్వని కుమార్, రాజ్ అంగద్ బావా, రఘు శర్మ, క్వింటన్ డి కాక్, ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్, షెర్పేన్ రూథర్‌ఫోర్డ్, కార్బిన్ బోష్, మిచెల్ సాంట్నర్.














Click it and Unblock the Notifications
