ఎమర్జెన్సీ నుంచి ఆర్టికల్ 370 వరకు.. రాజ్యాంగ దినోత్సవం వేళ మోదీ మాస్టర్ స్ట్రోక్!
రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రత్యేక వ్యాసాన్ని రాసుకొచ్చారు. ఇందులో రాజ్యాంగ బలం, సామాజిక-ఆర్థిక న్యాయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు గతంలో చోటుచేసుకున్న వివాదాస్పద రాజ్యాంగ నిర్ణయాలు, ప్రతిపక్షాల తీరుపై విమర్శలు గుప్పించారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యసాధనకు రాష్ట్రమే ప్రథమం, కర్తవ్య భావన అనే రెండు మంత్రాలను ఆయన దేశ ప్రజల ముందుంచారు.
సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలు
1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును గుర్తుచేసుకుంటూ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌తో సహా సభ్యులందరికీ ప్రధాని నివాళులర్పించారు. సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి కూడా నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి సేవ చేసే స్థాయికి ఎదగడం రాజ్యాంగం ఇచ్చిన శక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ఇండియాలో దాదాపు 50 కోట్ల మంది తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని మోదీ తెలిపారు. పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల, ఆయుష్మాన్ భారత్, ముద్ర, పీఎం స్వనిధి వంటి పథకాలతో పాటు డిజిటల్ టెక్నాలజీ, రూపీ కార్డు, యూపీఐ ద్వారా సామాన్యులకు సామాజిక ఆర్థిక న్యాయం అందుతోందని వివరించారు.

జీఎస్టీ కోసం 101వ సవరణ, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించిన 102వ సవరణ, ఆర్థికంగా బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించిన 103వ సవరణలను ప్రధాని ప్రస్తావించారు.
ప్రజలకు చేరువైన రాజ్యాంగం
1950 తర్వాత తొలిసారిగా రాజ్యాంగం అప్‌డేటెడ్ వెర్షన్ ఎనిమిదో షెడ్యూల్ లోని అన్ని 22 భాషల్లో అందుబాటులోకి వచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. అలాగే బ్రిటీష్ కాలం నాటి శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహితను తీసుకొచ్చి.. శిక్ష అంటే న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. గత దశాబ్ధంలో పౌరుల కర్తవ్యాలకు పెద్దపీట వేశామన్నారు.
ప్రతిపక్షాలపై మోదీ ఫైర్
దేశాన్ని ఐదు దశాబ్ధాల పాటు పాలించిన వారే రాజ్యాంగాన్ని బలహీనపరిచేలా వ్యవహరించారని ప్రధాని మోదీ ఆరోపించారు. 1951 నాటి మొదటి రాజ్యాంగ సవరణకు ఈ ఏడాదితో 75 ఏళ్లు పూర్తయ్యాయని, తొలి సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రాథమిక హక్కులను పరిమితం చేసేలా ఆ సవరణ జరిగిందని విమర్శించారు. అత్యవసర పరిస్థితి నాటి 42వ సవరణకు 50 ఏళ్లు పూర్తవుతున్నాయని, అది న్యాయ సమీక్ష శక్తిని తగ్గించిందని పేర్కొన్నారు. 38,39వ సవరణలను కూడా యువత అధ్యయనం చేయాలని సూచించారు.
ఎన్నికైన ప్రభుత్వాలను తొలగించేందుకు ఆర్టికల్ 356ను దాదాపు 100 సార్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఆర్టికల్ 370, 35-ఏ కారణంగా 70 ఏళ్లకు పైగా జమ్మూకశ్మీర్ లో పూర్తి రాజ్యాంగం అమలు కాలేదని.. 2019లో ఆ చారిత్రక అన్యాయానికి తెరపడిందని వెల్లడించారు. ఈ ఏడాది నక్సలిజం అంతం కావడం సంతృప్తినిచ్చిందని, అయితే మానసిక నక్సలైట్లు ఇంకా ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. ఓబీసీ రిజర్వేషనల్లో కోత విధించి ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్షం కోరుకుంటోందని, దానికి అంబేద్కర్ పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్య బిల్లును అడ్డుకున్నారని విమర్శిస్తూ.. ప్రతిపక్షం అడ్డంకుల పార్టీగా మారకూడదని హితవు పలికారు.
వికసిత్ భారత్ దిశగా..
2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్రమే ప్రథమం అనే ఆలోచన.. ప్రతి పనిలోనూ కర్తవ్య భావ మార్గదర్శకాలుగా నిలుస్తాయని ప్రధాని మోదీ తన వ్యాసంలో స్పష్టం చేశారు.
सभी देशवासियों को संविधान दिवस की हार्दिक शुभकामनाएं। इस पावन अवसर पर पूज्य बाबासाहेब एवं संविधान सभा की समस्त महान विभूतियों को मेरा नमन और वंदन। संविधान के रूप में उनके द्वारा दी गई सौगात भारतीय लोकतंत्र की अनमोल धरोहर है, जो विकसित भारत के संकल्प को साकार करने में हमारा मार्गदर्शन करती रहेगी।Greetings on Constitution Day, a day to pay homage to the makers of our Constitution and an occasion to reaffirm our commitment to strengthening the values enshrined in it. बहुधा बहुभिः सार्धं चिन्तिताः सुनिरूपिताः।कथञ्चिन्न विलीयन्ते विद्वद्भिश्चिन्तिता नयाः॥
— Narendra Modi (@narendramodi) November 26, 2026














Click it and Unblock the Notifications
