15 ఏళ్ల విద్యార్థితో లేచిపోయిన మహిళా టీచర్.. తోటి విద్యార్థి చెప్పడంతో.. ఏం జరిగింది..?
ఉత్తర్ ప్రదేశ్ లోని బస్తీ జిల్లా కప్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన జరిగింది. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థికి మాయమాటలు చెప్పి అతడ్ని తీసుకుని 26 ఏళ్ల మహిళా టీచర్ వెళ్లిపోయినట్లు సమాచారం. ఇక తమ కుమారుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు అంతా వెతికారు.. బంధువుల ఇళ్లు.. గ్రామం మొత్తం గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. దాంతో టీచర్ తో వెళ్లిపోయినట్లుగా భావించిన బాలుడి తల్లిదండ్రులు కప్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మహిళా టీచర్ పై పోక్సో, కిడ్నాప్ కేసును నమోదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రాకారం.. ఆ ప్రైవేట్ పాఠశాల కప్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోధ్వా గ్రామంలో ఉంది. ఆ పాఠశాల యజమాని కుమారుడి అదే స్కూల్ లో 11 వ తరగతి చదువుతున్నాడు. అయితే అదే పాఠశాలలో సంవత్సరం నుంచి పాఠాలు చెబుతున్న 26 ఏళ్ల రూపాలి అనే టీచర్ సోమవారం ఉదయం 7 గంటల సమయంలో విద్యార్థితో కలిసి జంప్ అయినట్లు సమాచారం.

ఇక ఆ విద్యార్థి స్నేహితుడు తెలిపిన వివరాల ప్రకారం.. టీచర్ రూపాలి.. విద్యార్థిని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కప్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్సై సునీల్ కుమార్ తివారీ ఆధ్వర్యంలో దర్యాప్తును ప్రారంభించారు. టీచర్, బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మైనర్ బాలుడి వ్యవహారం కావడంతో పోలీసులు కేసును తీవ్రంగా పరిగణించారు. మరోవైపు ఈ ఘటనతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ కుమారుడు క్షేమంగా రాావాలని ఆ బాలుడి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిందితురాలిని కఠినంగా శిక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications
