మహేష్ బాబు ఇంట పెళ్లి సందడి.. ఫొటోలతో సోషల్ మీడియా షేక్..

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రెండో తనయుడు సిద్ధార్థ్ గల్లా పెళ్లి పీటలెక్కారు. తాను ప్రేమించిన సౌత్ కొరియన్ అమ్మాయి హైన్ కిమ్ ను తాజాగా వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 13న ఇటలీలో వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే తాజాగా నవంబర్ 25 న వివాహబంధంతో ఈ జంట ఒక్కటైంది. వేరే దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని తన సోషల్ మీడియా ఖాతా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. దాంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి. నూతన దంపతులకు సినీ సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

SiddharthGalla MaheshBabu nephew ties the knot with a Korean girl social media abuzz with photos

అయితే ఈ వివాహ వేడుకకు మహేష్ బాబు హాజరుకానట్లు తెలుస్తోంది. ఆయన కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా షూటింగ్‌ తో మహేష్ బాబు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక సిద్ధార్థ్ గల్లాకు కొరియన్ అమ్మాయి హైన్ కిమ్ తో కాలేజీ డేస్ నుంచే పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. అలా కొంత కాలం ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పుడు వివాహబంధంతో ఒక్కటైంది.

ఇక గల్లా జయదేవ్, పద్మావతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అశోక్ గల్లా టాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నారు. చిన్న కుమారుడు సిద్ధార్థ్ సినీ రంగానికి దూరంగా ఉంటూ వ్యాపార బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇక మహేష్ బాబు మేనల్లుడి వివాహం కావడంతో నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు వారణాసి చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వారణాసి మూవీ తర్వాత మహేష్ బాబు చేసే సినిమాపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+