తమిళనాడులో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ.. సీఎం విజయ్ మెడకు ఉచ్చులా ‘కార్తీక దీపం’

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనపై ఎదురుదాడి చేయడానికి, రాష్ట్రంలో బలపడటానికి బీజేపీకి బంగారు పళ్లెంలో పెట్టి మరీ అస్త్రాన్ని అందించారు. మధురైలోని తిరుప్పరకుండ్రం కొండపై ఉన్న పురాతన రాతి స్తంభం 'దీపతూన్' వద్ద కార్తీక దీపం వెలిగించే విషయంలో విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, రాష్ట్రంలో పట్టు సాధించేందుకు ఎదురుచూస్తున్న బీజేపీకి బలమైన రాజకీయ అస్త్రాన్ని అందించింది. దీంతో డీఎంకే తరహాలోనే మైనార్టీలను బుజ్జగిస్తూ హిందూ వ్యతిరేక భావజాలాన్ని టీవీకే ప్రభుత్వం కొనసాగిస్తోందంటూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ముమ్మర ప్రచారం ప్రారంభించింది.

Tiruparankundram Deepam: కొండపై వెలగని దీపం-సుప్రీం ఉత్తర్వుల్నీ లెక్కచేయని విజయ్..!
Tiruparankundram Deepam: కొండపై వెలగని దీపం-సుప్రీం ఉత్తర్వుల్నీ లెక్కచేయని విజయ్..!

మండపం వద్దే దీపాలు వెలిగించారు

సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టి, కేవలం సాంప్రదాయ ప్రదేశమైన ఉచ్చిపిళ్లయార్ మండపం వద్ద మాత్రమే దీపం వెలిగించడం ద్వారా విజయ్ ప్రభుత్వం నేరుగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించినట్లయింది. వాస్తవానికి, నవంబర్ 24న ఒకే ఒక్కసారి ప్రత్యేక ఏర్పాటుగా ఆలయ ప్రతినిధులు, అధికారుల సమక్షంలో దీపతూన్ వద్ద దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఒక రకంగా ఇది విజయ్ ప్రభుత్వానికి దక్కిన అద్భుతమైన అవకాశం.

BJP kicks off its game in Tamil Nadu Karthika Deepam becomes a noose around CM Vijay s neck

అయితే విజయ్ రాజకీయ సలహాదారులు ఇచ్చిన చెత్త సలహా ప్రకారం ఉచ్చిపిళ్లయార్ మండపం వద్ద మాత్రమే దీపం వెలిగించి హిందువుల ఆగ్రహానికి గురయ్యారు.సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ దీపతూన్ వద్ద దీపం వెలిగించి ఉంటే, అటు హిందూ ఓటు బ్యాంకును నొప్పించకుండానే.. ఇటు మైనారిటీ, ద్రవిడ వర్గాలకు 'కోర్టు ఆదేశాల మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో చేశాము' అని నచ్చజెప్పే సురక్షిత మార్గం సీఎం విజయ్‌కు ఉండేది. కానీ వామపక్షాలు, వీసీకే, ఎండీఎంకేల ఒత్తిడికి తలొగ్గి చివరి నిమిషంలో రివ్యూ పిటిషన్ వేయడం, స్టే లేకపోయినా దీపారాధనను అడ్డుకోవడమే విజయ్ చేసిన పెద్ద రాజకీయ తప్పిదం.

సీఎం విజయ్ తగ్గేదే లేదు: సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్
సీఎం విజయ్ తగ్గేదే లేదు: సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్

ఎలక్ట్రిక్ లైటింగ్ తో అవమానం

దీనికి తోడు అక్కడ ఎలక్ట్రిక్ లైటింగ్ ఏర్పాటు చేయించి ఆధ్యాత్మిక ఆచారాలను అవమానించారు. దీనిపై మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కలెక్టర్‌ను ఆదేశించడంతో కోర్టు ధిక్కరణ చర్యలను విజయ్ ప్రభుత్వం ఎదుర్కోవల్సి ఉంది. ఇదే అదనుగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్, మాజీ అధ్యక్షుడు అన్నామలై సహా బీజేపీ నేతలు విజయ్ ప్రభుత్వాన్ని హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా అభివర్ణిస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చారు. గత డీఎంకే తరహాలోనే మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలను విజయ్ కొనసాగిస్తున్నారని బీజేపీ ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది.

మొత్తంగా, సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించి ఉంటే ఎంతో హుందాగా ముగిసిపోవాల్సిన వివాదాన్ని తప్పుడు వ్యూహాలతో విజయ్ తన మెడకు ఉచ్చులా మార్చుకున్నారు. ఒకవైపు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ, మరోవైపు హిందూ సమాజంలో వ్యతిరేకత మధ్య చిక్కుకున్న విజయ్ ఈ తప్పటడుగుకు మూల్యం చెల్లించక తప్పదు. రాబోయే రోజుల్లో తమిళనాడులో కాషాయ దళం తన రాజకీయ గేమ్‌ను మరింత దూకుడుగా ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+