థియేటర్లలో మెంటల్ మాస్ బీభత్సం.. 21 రోజులుగా తగ్గని క్రేజ్..!
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన రామాయణం సినిమా బాక్సాఫీసు వద్ద అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతోంది. దీపావళి కానుకగా నవంబర్ 5 న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ డే నుంచే సంచలన వసూల్లతో దూసుకెళ్తోంది. నార్త్.. సౌత్.. అని తేడా లేకుండా ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాలను అధిగమిస్తూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది 'రామాయణ' మూవీ.
ట్రేడ్ పండితుల నుంచి సమాచారం ప్రకారం.. రామాయణ మూవీ కేవలం 21 రోజుల్లోనే 'బాహుబలి 2' లైఫ్ టైమ్ వసూళ్లను అధిగమించింది. దాంతో భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో మూడో స్థానానికి చేరింది రామాయణ మూవీ. ఇక తొలి స్థానంలో నితీష్ తివారీ- అమీర్ ఖాన్ కాంబోలో వచ్చిన 'దంగల్' మూవీ నిలిచింది. అలాగే రెండో స్థానంలో రణ్ వీర్ సింగ్- ఆదిత్య ధర్ కాంబోలో వచ్చిన 'ధురంధర్-2' ఉంది.
ఇప్పటివరకూ మూడో స్థానంలో దర్శకధీరుడు రాజమౌళి- ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి 2 ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ. 1,788 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే తాజాగా రామాయణ మూవీ కేవలం 21 రోజుల్లోనే రూ. 1,790 కోట్ల నుంచి రూ. 1,800 కోట్లకు పైగా రాబట్టింది. దాంతో రామాయణ మూవీ ఇప్పుడు మూడో స్థానానికి చేరుకుంది. ఇక నెక్స్ట్ టార్గెట్ గా ధురంధర్ 2 ఉంది. రానున్న రోజుల్లో ధురంధర్ 2 రికార్డులను కూడా ఈ మూవీ సునాయాసంగా అధిగమించే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు రామాయణ మూవీని ప్రేక్షకులకు మరింత చేరువచేయాలన్న ఆలోచనతో మంగళవారం నుంచి ఈ సినిమా టికెట్ ధరలను కేవలం రూ. 99 నుంచే అందుబాటులోకి తీసుకొచ్చింది చిత్ర యూనిట్. ఇక ఈ మూవీలో శ్రీ రాముడిగా రణ్ బీర్ కపూర్ నటించారు. అలాగే సీతాదేవిగా సాయి పల్లవి అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఇక రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా అలరించారు. దాంతోపాటు హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ నటించనున్నారు. ఈ మూవీ సెకండ్ పార్ట్ 2028 లో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ కంపోజర్స్ హన్స్ జిమ్మర్, ఏ. ఆర్. రెహమాన్ సంయుక్తంగా స్వరాలను సమకూరుస్తున్నారు. ఇక ఫ్రైమ్ స్టూడియోస్, మాన్ స్టర్ మైండ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై నమిత్ మల్హోత్రా, యష్ కలిసి నిర్మించారు.












Click it and Unblock the Notifications
