డిసెంబర్ లో బ్యాంకులకు సెలవు రోజులు ఇవే
Bank holidays in December: ప్రజల రోజువారీ కార్యకలాపాల్లో బ్యాంకులు ఓ భాగం అయ్యాయి. బ్యాంకులు, ఏటీఎంలను సందర్శించని వారు బహుశా ఎవరూ ఉండకపోవచ్చు. 95 శాతం మంది ప్రజలు ఏదో ఒక సందర్భంలో బ్యాంకులు, ఏటీఎం సేవలను వినియోగించుకుని ఉంటారంటూ కొన్ని సర్వేలు స్పష్టం చేస్తోన్నాయి. తమ నగదు మొత్తాలను భద్రపరచుకోవడానికి బ్యాంకులు, పోస్టాఫీస్ తప్ప మరో ప్రత్యామ్నాయం అందుబాటులో లేదు.
డిసెంబర్ నెల మొత్తానికీ దేశవ్యాప్తంగా బ్యాంకుల సెలవు రోజులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. సాధారణంగా మూడు కేటగిరీల్లో బ్యాంకుల హాలిడేలను ప్రకటిస్తుంటుంది రిజర్వు బ్యాంక్. ఒకటి- నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రెండు- నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, మూడు- బ్యాంక్స్ క్లోసింగ్ ఆఫ్ అకౌంట్స్.

ఈ మూడింట్లో మొదటి కేటగిరీ కింద సాధారణ సెలవులు వర్తింపజేస్తుంటుంది. దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో వారపు సెలవులు, స్థానిక పండుగలతో కలిపి మొత్తం 18 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. డిసెంబర్‌లో మొత్తం నాలుగు ఆదివారాలు.. 6, 13, 20, 27 వచ్చాయి. వీటితో పాటు రెండో శనివారం 12, నాలుగో శనివారం 26) కూడా బ్యాంకులు అందుబాటులో ఉండవు. డిసెంబర్ 25న క్రిస్మస్, 26న నాలుగో శనివారం, 27న ఆదివారం రావడంతో వరుసగా మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.
డిసెంబర్ 1వ తేదీన రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ లల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. 3వ తేదీన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పర్వదినం కావడం వల్ల గోవా వ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. 9, 11 తేదీల్లో లోసూంగ్ / నామ్‌సూంగ్ పండుగ సెలవు కారణంగా సిక్కింలో బ్యాంకులు అందుబాటులో ఉండవు. 18, 19లల్లో యు సోసో థామ్ వర్ధంతి / గోవా విమోచన దినం నేపథ్యంలో మేఘాలయ, గోవాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
25వ తేదీన క్రిస్మస్ పండుగ నాడుదేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా బ్యాంకులు పని చేయవు. 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఈశాన్య రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది. 30న మేఘాలయలో యు కియాంగ్ నాంగ్‌బా వర్ధంతి, డిసెంబర్ 31న న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
బ్యాంకులల మూసివేతతో సంబంధం లేకుండా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. నెట్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, ఏటీఎంలు, యూపీఐ ఆధారిత గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి అప్లికేషన్లు 24 గంటలూ పనిచేస్తాయి. దీనివల్ల డిజిటల్ నిధుల బదిలీలు, ఆన్‌లైన్ కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులకు ఎటువంటి అవరోధం ఏర్పడదు.













Click it and Unblock the Notifications
