గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికలో బిగ్ ట్విస్ట్, జాబితాలో..!!
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతోంది. దీంతో, వచ్చే ఎన్నికలే లక్ష్యం గా పార్టీ హైకమాండ్ ప్రతీ నిర్ణయంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. ప్రభుత్వం.. పార్టీలో మార్పులు.. నిర్ణయాల పైన సీఎం రేవంత్ తో హైకమాండ్ ముఖ్యులు చర్చిస్తున్నారు. ఇదే సమయంలో గవర్నర్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల విషయంలో సీఎం రేవంత్ తన ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. గతంలో సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధుల పైన రేవంత్ ఛాయిస్ కే ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ పార్టీ వ్యవహారాల నూతన ఇంఛార్జ్ గా సందీప్ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇప్పటికే తెలంగాణ నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. ఇదే సమయంలో ఆయనకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక బిగ్ టాస్క్ గా మారింది. ఇప్పటి వరకు రేవంత్ ఛాయిస్ గా పలువురి పేర్లు తెర మీదకు వచ్చాయి.సామాజిక వర్గాల వారీగా ఎవరికి సీట్లు కేటాయిస్తారనేది స్పషత వస్తోంది. ఓ స్థానాన్ని పద్మశాలీ లకు, మరోస్థానాన్ని ముదిరాజ్ కులస్తులకు కేటాయించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మేరకు రేవంత్ ఇచ్చిన సంకేతాలు క్లియర్ గా ఉన్నాయి. ఇక.. మూడో స్థానం కోసం పోటీ పెరుగు తోంది. సామాజిక సమీకరణాలే కీలకంగా మారాయి. తెలంగాణ ఉద్యమకారు లు, అమరుల కుటుంబాలు, వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులు సైతం ఈ మూడో స్థానం కోసం పోటీ పడుతున్నారు. గతంలో నామినేట్ అయిన బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్‌ల పదవీకాలం నవంబర్ 14తో ముగిసింది.

తదుపరి కేబినెట్ భేటీలో ఖరారు
అయితే, వీరి స్థానంలో తమకు అవకాశం ఇవ్వాలని దాదాపు 30 నేతలు రేసులోకి వచ్చారు. ఈ సమయంలో సీఎం రేవంత్ ఆచి తూచి ఎంపిక పైన కసరత్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధిష్టానం సామ రామ్మోహన్ రెడ్డి, రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలకు అవకాశం కల్పించింది. ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరికి ఈ స్థానాలను కేటాయించడంతో, గవర్నర్ కోటాలో మాత్రం సామాజిక న్యాయాన్ని పాటిస్తూ బలహీన వర్గాలు, ఇతర సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో బలంగా వినిపిస్తోంది.పద్మశాలి వర్గం నుంచి కొండడా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె డాక్టర్ పవిత్ర వాణి కి ఛాన్స్ దక్కుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అదే విధంగా మరో సీటు ముదిరాజ్ వర్గానికి ఇవ్వటం దాదాపు ఖాయమైంది. అందులో భాగంగా ఈ వర్గం నుంచి నీలం మధు, ఎం. సునీత రావు వంటి నాయకులు తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. మూడో స్థానం కోసం ఓసీ వర్గాల నుంచి ఆర్‌టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ రావు, గుండెపల్లి దయా సాగర్, పవన్ మల్లాది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీంతో.. చివరగా ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications
