ఐటీ జాబ్స్‌కు కేరాఫ్‌గా హైదరాబాద్..బెంగళూరును వెనక్కి నెట్టి సరికొత్త రికార్డు..!!

Hyderabad Jobs:ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ జోరు.. దేశంలోనే టాప్‌! ఐటీ రంగమే ప్రధాన బలం
ఒకప్పుడు ఐటీ ఉద్యోగాలకు బెంగళూరు కేరాఫ్‌గా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి క్రమంగా మారుతోంది.సాఫ్ట్‌వేర్‌ కొలువుల నుంచి వైట్‌కాలర్‌ ఉద్యోగాల వరకు హైదరాబాద్‌ తన సత్తా చాటుతోంది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఉద్యోగ నియామకాల వృద్ధిలో భాగ్యనగరం అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.ఐటీ,టెక్నాలజీ రంగాల్లో పెరుగుతున్న అవకాశాలు,ఇతర పరిశ్రమల్లో డిజిటల్‌ నైపుణ్యాలకు పెరుగుతున్న ప్రాధాన్యం నగరానికి కలిసొస్తున్నాయి.2026 జనవరి నుంచి అక్టోబర్‌ వరకు నమోదైన నియామకాల గణాంకాలు హైదరాబాద్‌ జాబ్ మార్కెట్‌ దూకుడును స్పష్టం చేస్తున్నాయి.ఫౌండిట్‌ ఇన్‌సైట్స్‌ ట్రాకర్‌ (Found it insights tracker) నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.

దేశ సగటు కంటే రెట్టింపు వేగంతో..

ఫౌండిట్‌ నివేదిక ప్రకారం..2026 జనవరి నుంచి అక్టోబర్‌ మధ్య హైదరాబాద్‌లో వైట్‌కాలర్‌ ఉద్యోగ నియామకాలు 8.51 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశాయి.ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఈ నియామకాల వృద్ధి సగటు 3.30 శాతానికే పరిమితమైంది.అంటే జాతీయ సగటుతో పోలిస్తే హైదరాబాద్‌ ఉద్యోగ మార్కెట్‌ మెరుగైన వృద్ధిని కనబరిచింది.నగరాల వారీగా చూస్తే బెంగళూరు 6.71 శాతం వృద్ధితో రెండో స్థానంలో,ముంబై 6.15 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి.ఈ గణాంకాలు ఐటీ హబ్‌గా హైదరాబాద్‌ ప్రాధాన్యం మరింత పెరుగుతోందనే విషయాన్ని సూచిస్తున్నాయి.

hyderabad-tops-indian-cities-in-white-collar-job-growth-with-8-51-rise-in-2026-reveals-report

ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు

రంగాల వారీగా చూస్తే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) విభాగం నియామకాల వృద్ధిలో ముందుంది.ఈ రంగంలో ఏకంగా 20.28 శాతం పెరుగుదల నమోదైంది.నాన్‌ ప్రాఫిట్‌ రంగంలో 19.44 శాతం, పర్యాటక రంగంలో 13.76 శాతం వృద్ధి కనిపించింది.మరోవైపు కొన్ని నగరాల్లో మాత్రం ఉద్యోగ నియామకాలు తగ్గుముఖం పట్టాయి.ముఖ్యంగా చండీగఢ్‌లో నియామకాలు 11.19 శాతం క్షీణించడం గమనార్హం.దీంతో దేశంలోని అన్ని నగరాల్లో ఒకే తరహా ఉద్యోగ వృద్ధి లేదనే విషయం స్పష్టమవుతోంది.

2027లో మరిన్ని కొలువులు వచ్చే అవకాశం

వచ్చే ఏడాది కూడా ఉద్యోగ మార్కెట్‌ ఆశాజనకంగా ఉండనుందని ఫౌండిట్‌ అంచనా వేస్తోంది.2027లో దేశవ్యాప్తంగా వైట్‌కాలర్‌ ఉద్యోగ నియామకాలు 8.16 శాతం పెరిగి మొత్తం 1.38 కోట్లకు చేరవచ్చని నివేదిక పేర్కొంది.ముఖ్యంగా రిటైల్‌ రంగంలో 19.99 శాతం,కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌లో 14.25 శాతం,తయారీ రంగంలో 12.02 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. నగరాల విషయానికొస్తే కోయంబత్తూర్‌ 12.52 శాతం,బెంగళూరు 11.29 శాతం వృద్ధితో ముందుండవచ్చని అంచనా వేసింది.

అనుభవజ్ఞులకే ప్రాధాన్యం.. మారుతున్న నియామక ధోరణులు
2026లో బ్యాంకింగ్‌,ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌,ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ),ఐటీ సేవల సంస్థలు నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరించాయి.ముఖ్యంగా అనుభవం ఉన్న నిపుణుల ఎంపికకు ప్రాధాన్యమిచ్చాయి.మరోవైపు రియల్‌ ఎస్టేట్‌,ప్రయాణ,ఆరోగ్య సంరక్షణ రంగాలు ఉద్యోగాల కల్పనకు తోడ్పడ్డాయి.నాన్‌ ఐటీ సంస్థలు సైతం తమ కార్యకలాపాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించేందుకు టెక్నాలజీ నిపుణులను నియమించుకుంటున్నాయి.

లాజిస్టిక్స్‌,బీఎఫ్‌ఎస్‌ఐ రంగాల్లోనూ అవకాశాలు

2027లో లాజిస్టిక్స్‌, రవాణా రంగాల్లో 10.15 శాతం,బీఎఫ్‌ఎస్‌ఐ విభాగంలో 10.03 శాతం నియామకాల వృద్ధి నమోదవుతుందని నివేదిక అంచనా వేసింది.ఆన్‌లైన్‌ ఉద్యోగ ప్రకటనల ఆధారంగా రూపొందించిన ఈ విశ్లేషణ దేశీయ పరిశ్రమల్లో పెరుగుతున్న సాంకేతిక అవసరాలను కూడా ప్రతిబింబిస్తోంది.

మొత్తంగా చూస్తే ఉద్యోగ మార్కెట్‌ కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా తయారీ,రిటైల్‌,ఆరోగ్య సంరక్షణ,ఆర్థిక సేవలు వంటి విభాగాలకూ విస్తరిస్తోంది.హైదరాబాద్‌ ప్రస్తుతం నియామకాల వృద్ధిలో ముందంజలో ఉండటం నగరంలోని ఉద్యోగార్థులకు సానుకూల పరిణామం.అయితే మారుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడం,అనుభవాన్ని పెంచుకోవడం నిరుద్యోగులకు కీలకం కానుంది.రాబోయే ఏడాది ఈ అవకాశాలను అందిపుచ్చుకునే వారికి జాబ్ మార్కెట్‌లో మెరుగైన అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+