పవన్‌ చెప్పినా.. రాజీనామాకు నో - మొండికేసిన జనసేన నేత, అటు ఆమరణ దీక్ష హెచ్చరిక..!!

మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికల వివాదం కొత్త మలుపు తీసుకుంటోంది. కూటమి పార్టీల మధ్య వైస్ ఛైర్మన్ల సీట్ల సర్దుబాటు మేరకు ఎన్నికలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో కూటమి నిర్ణయా ల కు భిన్నంగా ఎన్నికలు జరిగాయి. నిడుదవోలు లో టీడీపీకి దక్కాల్సిన వైస్ ఛైర్మన్ స్థానం లో జనసేన అభ్యర్ధి ఎంపికయ్యారు. కూటమి నిర్ణయాలను ఉల్లంఘించినందుకు మంత్రి దుర్గేశ్ పైన పవన్ సీరియస్ అయ్యారు. వారితో రాజీనామా చేయించాలని ఆదేశించారు. కానీ, ఆ జనసేన నేత మాత్రం ససేమిరా అంటున్నారు.

మున్సిపల్ వైస్ ఛైర్మన్ వివాదం కీలక మలుపు తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఎన్నికలో కూటమి పార్టీల మధ్య ఏర్పడిన వివాదం కొనసాగుతోంది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చెప్పినా రాజీనామా చేసేందుకు ఆ పార్టీ నేత కల్యాణ్‌ చక్రవర్తి ససేమిరా అంటున్నారు. పొత్తులో భాగంగా ఇక్కడ వైస్‌ చైర్మన్‌ పదవిని టీడీపీకి కేటాయించగా.. ఈ ఎన్నికలో అనూహ్యంగా ఇద్దరు వైసీపీ కౌన్సిలర్ల మద్దతుతో జనసేన నేత కల్యాణ్‌ చక్రవర్తి వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికైన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి కందుల దుర్గేశ్‌ను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ వివరణ కోరారు. కల్యాణ్‌ చక్రవర్తితో రాజీనామా చేయించాలని ఆదేశించారు. అయితే, రాజీనామా చేసేది లేదని కల్యాణ్‌ చక్రవర్తి తేల్చి చెప్పడంతో ఉత్కంఠ కొనసాగుతోంది.

నేడు బెంగళూరు ఈ ప్యాలెస్ లో అంజలీ వివాహం, 'ఒర ఆకాశం’ లో రిసెప్షన్‌- సీఎం హాజరు..!!
నేడు బెంగళూరు ఈ ప్యాలెస్ లో అంజలీ వివాహం, 'ఒర ఆకాశం’ లో రిసెప్షన్‌- సీఎం హాజరు..!!
nidadavolu-vice-chairman-row-kalyan-chakravarthy-refuses-to-resign-despite-pawan-kalyan-s-directive

టీడీపీ నేత ఆమరణ దీక్ష హెచ్చరిక

ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే మంగళవారం చైర్‌పర్సన్‌ మురాల జ్యోతి, వైస్‌ చైర్మన్‌ కల్యాణ్‌ చక్రవర్తి, జనసేన కౌన్సిలర్లు మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చి చైర్మన్‌ చాంబర్‌లో కొద్దిసేపు ఉండి వెళ్లారు. మరోవైపు 24 గంటల్లో అధిష్ఠానం నిర్ణయం తీసుకోకపోతే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బూరుగుపల్లి శేషారావు ప్రకటించారు. రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారం రాజకీయంగా దుమారానికి కారణమవుతోంది. దీంతో, ఇప్పుడు పవన్ నిడుదవోలు వివాదం పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారుతోంది. కాగా. నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికపై ఏర్పడిన సంక్షోభానికి తెరపడింది. కూటమి పెద్దల జోక్యంతో స్థానిక నేతల మధ్య రాజీ కుదిరింది. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించిన కొలగాని శిరీష ఎట్టకేలకు వైస్‌చైర్‌పర్సన్‌ పదవిని దక్కించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+