రియాద్ ఫైనాన్షియల్ టవర్స్ పై భీకర దాడి

సౌదీ అరేబియాపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు తమ దాడులను రోజురోజుకూ తీవ్రతరం చేస్తూనే వస్తోన్నారు. ఇదివరకు అక్కడి విమానాశ్రయాలు, ఆయిల్ రిఫైనరీలపై వరుసగా క్షిపణులను సంధించారు. నాటి విధ్వంసం నుంచి సౌదీ అరేబియా క్రమంగా కోలుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి విరచుకుపడ్డారు. భీకర దాడికి దిగారు. తాజా ఘటనలో ఇద్దరు భారతీయులు సహా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌పై హౌతీలు తాజా దాడులు చేపట్టారు. డ్రోన్ దాడికి పాల్పడ్డారు. రియాద్ నడిబొడ్డున ఫైనాన్షియల్ టవర్స్ ను లక్ష్యంగా ఈ దాడి చోటు చేసుకోవడం దాని తీవ్రతకు తెలియజేస్తోంది. ఈ ఘటనలో ఈజిప్ట్, నేపాల్, భారత్, సౌదీ అరేబియాకు చెందిన పౌరులు గాయపడ్డారు. దాడి జరిగిన వెంటనే సౌదీ అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.

Houthis Yemen backed rebels launched attack on PIF tower in Saudi Arabia financial district Riyadh

సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ ప్రధాన కార్యాలయం ఉన్న అత్యంత ఎత్తైన టవర్ పై ఈ డ్రోన్ పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో టవర్ పైభాగం దెబ్బతిన్నది. 385 మీటర్ల ఎత్తయిన టవర్ ఇది. 80 అంతస్తుల్లో నిర్మితమైంది. తాజా దాడిలో దాదాపుగా 19 అంతస్తులు దెబ్బతిన్నట్టు సౌదీ సివిల్ డిఫెన్స్ తెలిపింది. వారం రోజుల వ్యవధిలో రియాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌పై ఇలాంటి దాడి జరగడం ఇది రెండోసారి. గతంలో జరిగిన దాడిలో కూడా ఆస్తి నష్టం భారీగా సంభవించింది.

టీటీడీ ఛైర్మన్ పదవి ఖాళీ అయిన వేళ.. తిరుమలలో మాజీ సీజేఐ ఎన్వీ రమణ
టీటీడీ ఛైర్మన్ పదవి ఖాళీ అయిన వేళ.. తిరుమలలో మాజీ సీజేఐ ఎన్వీ రమణ

రెసిడెన్షియల్ జోన్లు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా హౌతీలు జరుపుతున్న దాడులను సౌదీ అరేబియా ఘాటుగా స్పందించింది. పిరికిపంద చర్యగా అభివర్ణించింది. వీటిని సహించబోమని హెచ్చరించింది. హౌతీల దాడులను తిప్పి కొడతామని సౌదీ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మాలిక్ స్పష్టం చేశారు. ఈ దాడిని అమెరికా, యూఏఈ, ఖతార్, కువైట్, పాకిస్తాన్ తదితర దేశాలు ఖండించాయి. హౌతీ చర్యలను తప్పుపట్టాయి. సౌదీ అరేబియా మంత్రితో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్‌లో మాట్లాడారు. ఈ దాడుల పట్ల నిరసన తెలిపారు.

వైభవ్ సూర్యవంశీ శివతాండవం: 28 సిక్సర్లు, 52 బంతుల్లో డబుల్ సెంచరీ
వైభవ్ సూర్యవంశీ శివతాండవం: 28 సిక్సర్లు, 52 బంతుల్లో డబుల్ సెంచరీ

ఈ దాడుల తర్వాత గల్ఫ్ రీజియన్ లో భద్రతాపరమైన ఆందోళనలు పెరగడంతో రియాద్‌కు రాకపోకలు సాగించే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. సౌదీ అరేబియాలో జరగాల్సిన పలు అంతర్జాతీయ సదస్సులు, స్పోర్ట్స్ ఈవెంట్లు వాయిదా పడ్డాయి. యెమెన్‌లో అంతర్యుద్ధం తీవ్రరూపం దాల్చడం, సౌదీ అరేబియాపై దాడులు పెరగడం వల్ల గల్ఫ్ రీజియన్ లో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+