టీటీడీ ఛైర్మన్ పదవి ఖాళీ అయిన వేళ.. తిరుమలలో మాజీ సీజేఐ ఎన్వీ రమణ

Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 75,640 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 23,439 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.13 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉండలేదు. క్యూలైన్ ద్వారా నేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది.

తిరుమల శ్రీవారి అలయంలో మంగళవారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం అత్యంత వైభవంగా జరగింది. శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.. టీటీడీ. కార్తీక పున్నమినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, పూజాదికాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం జరిగింది. సాయంత్రం 5 నుండి రాత్రి 8: 30 గంటల వరకు ఈ కార్యక్రం కొనసాగింది.

Karthika Deepotsavam was observed with fervour with illuminated ghee lit lamps in Srivari Temple

ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో భాగంగా మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళం అర దగ్గర కొత్త మూకుళ్లతో దీపాలను వెలిగించారు. అనంతరం ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు.

వైభవ్ సూర్యవంశీ శివతాండవం: 28 సిక్సర్లు, 52 బంతుల్లో డబుల్ సెంచరీ
వైభవ్ సూర్యవంశీ శివతాండవం: 28 సిక్సర్లు, 52 బంతుల్లో డబుల్ సెంచరీ

ఆతర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారు బావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజ స్తంభం, బలిపీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూల బావి, రంగ నాయక మండపం, మహా ద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా వెయ్యి నేతి జ్యోతులను మంగళ వాయిద్యల మధ్య వేద మంత్రోచ్ఛారణలతో వెలిగించారు.

తిరుమలలో దినదినాభివృద్ధి: అన్నప్రసాదం విరాళాలు రూ. 3,100 కోట్లు పైమాటే
తిరుమలలో దినదినాభివృద్ధి: అన్నప్రసాదం విరాళాలు రూ. 3,100 కోట్లు పైమాటే

శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవ శోభను తిలకించి భక్తులు తన్మయత్వంతో పులకించారు. కార్తీక దీపోత్సవం కారణంగా టీటీడీ పౌర్ణమి గరుడ సేవ, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది. పెద్ద జీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ, టీటీడీ సాధికారిక మండలి చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈఓ భాస్కర్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ గోశాలను సందర్శించిన పార్లమెంటరీ కమిటీ
టీటీడీ గోశాలను సందర్శించిన పార్లమెంటరీ కమిటీ

ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ పదవి ఖాళీగా ఉన్న విషయం తెలిసింది. బీఆర్ నాయుడు పదవీ కాలం ముగిసిన తర్వాత నూతనంగా మరెవరినీ ఆ పదవిలో నియమించలేదు ప్రభుత్వం. దీనికి బదులుగా స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసింది. నూతన ఛైర్మన్ ను నియమించాల్సి ఉంది. ఈ పరిస్థితుల మధ్య ఎన్వీ రమణ తిరుమలలో కార్తీక దీపోత్సవంలో పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+