నేడు బెంగళూరు ఈ ప్యాలెస్ లో అంజలీ వివాహం, ‘ఒర ఆకాశం’ లో రిసెప్షన్- సీఎం హాజరు..!!
ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కుమార్తె అంజలి వివాహం నేడు జరగనుంది. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేసారు. యలహంకలో వివాహం చేయాలని భావించినా.. మాజీ సీఎం జగన్ అభ్యంతరంతో వివాహ వేదిక మార్పు చేసారు. కాగా.. యలహంక నివాసంలోకి షర్మిల వరకు అనుమతి నిరాకరిస్తూ కోర్టు లో దాఖలైన పిటీషన్ ఆధారంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో.. ఈ రోజు వివాహం... రిసెప్షన్ కు ప్రముఖులు హాజరు కానున్నారు.
వైఎస్ షర్మిల కుమార్తె అంజలిరెడ్డి, సోమల రఘురామరెడ్డి వివాహం ఈ రోజు బెంగళూరులోని లీలా ప్యాలెస్ లో జరగనుంది. హెచ్ఏఎల్ రోడ్డులోని ఈ లీలా ప్యాలెస్ లో కుటుంబ సభ్యులు.. బంధువుల సమక్షంలో వివాహం నిర్వహిస్తున్నారు. వాస్తవానికి యలహంకలోని ప్యాలెస్‌లో తన కుమార్తె వివాహం చేయాలని షర్మిల భావించారు. కానీ.. మాజీ సీఎం జగన్ అభ్యంతరంతో వివాహ వేదిక మార్పు చేసారు. ఆ తరువాత యలహంక నివాసం తమకు లీజుకు ఇచ్చారని.. అందులోకి షర్మిల ప్రవేశానికి అనుమతి ఇవ్వవద్దంటూ కోర్టులో దాఖలైన పిటీషన్ మేరకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో షర్మిల యలహంక ఇంట్లోకి వెళ్లేందుకు ఆదివారం ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు వివాహ వేదికగా నిర్ణయించిన హెచ్ఏఎల్ రోడ్డులోని లీలాప్యాలెస్‌కు వెళ్లారు. ఈ రోజు అక్కడే వివాహం జరగనుంది.

రేపు నంది హిల్స్ లో రిసిప్షెన్
కాగా, రేపు (గురువారం) అంజలిరెడ్డి, సోమల రఘురామరెడ్డి వివాహ రిసెప్షన్ గురువారం రాత్రి చిక్కబళ్ళాపుర జిల్లా నంది హిల్స్‌లో జరగనుంది. అక్కడి 'ఒర ఆకాశం' రిసార్ట్‌లో రిసెప్షన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరు కానున్నారు. డిసెంబర్ 10న హైదరాబాద్ లోనూ రిసిప్షెన్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటుగా తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటుగా పలువురు ప్రముఖులను షర్మిల తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. వివాహ వేదిక పైన జరిగిన వివాదంతో ఈ పెళ్లి వేళ రాజకీయంగానూ చర్చ జరిగింది. కాగా.. రేపు బెంగళూరు లో జరిగే వివాహ రిసిప్షెన్ కు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు కర్ణాటక సీఎం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ప్రముఖులు అంజలీ- రఘురామిరెడ్డికి అభినందనలు తెలుపుతూ సందేశాలు పంపిస్తున్నారు.













Click it and Unblock the Notifications
