సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి ఏపీకి 30 సంక్రాంతి ప్రత్యేక రైళ్లు: రూట్స్, హాల్ట్ స్టేషన్లు

సంక్రాంతి పండగ సమయంలో నెలకొనే ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్, హైదరాబాద్ వంటి స్టేషన్ల నుంచి మొత్తం 30 రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వీటికి సంబంధించిన వివరాలను కూడా అధికారులు వెల్లడించారు. తేదీలు, రూట్లతో కూడిన ప్రకటన విడుదల చేశారు. ఆయా రైళ్లన్నీ కూడా ఏపీలోని వివిధ స్టేషన్లకు కనెక్టివిటీని కల్పించడానికి ఉద్దేశించినవే.

సికింద్రాబాద్- పార్వతీపురం

  • డిసెంబర్ 23, 30, జనవరి 6, 13, 20, 27 తేదీల్లో ప్రతి బుధవారం సాయంత్రం 7:30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే నంబర్ 07009 ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 1:15 నిమిషాలకు పార్వతీపురం చేరుకుంటుంది.
South Central Railway to Operate 30 Special Trains in Sankranti From Secunderabad to various Stations
  • తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 24, 31, జనవరి 7, 14, 21, 28 తేదీల్లో ప్రతి గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు పార్వతీపురం నుంచి బయలుదేరే నంబర్ 07010 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.
  • చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
సికింద్రాబాద్ నుంచి ఏపీ మీదుగా వారణాశి, అయోధ్య స్పెషల్: హాల్ట్ స్టేషన్లు
సికింద్రాబాద్ నుంచి ఏపీ మీదుగా వారణాశి, అయోధ్య స్పెషల్: హాల్ట్ స్టేషన్లు

చర్లపల్లి- నర్సాపూర్

  • జనవరి 10, 12, 17, 19 తేదీల్లో ప్రతి ఆది, మంగళవారం సాయంత్రం 7:40 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07013 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారు జామున 5 గంటలకు నర్సాపూర్ కు చేరుకుంటుంది.
  • తిరుగు ప్రయాణంలో జనవరి 11, 13, 18, 20 తేదీల్లో ప్రతి సోమ, బుధవారం రాత్రి 10 గంటలకు నర్సాపూర్ నుంచి బయలుదేరే నంబర్ 07014 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 7:50 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
  • నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
సికింద్రాబాద్, ఏపీ మీదుగా కొల్లం ప్రత్యేక రైలు: అరుణాచలం, శ్రీరంగం కవర్ చెయ్యొచ్చు
సికింద్రాబాద్, ఏపీ మీదుగా కొల్లం ప్రత్యేక రైలు: అరుణాచలం, శ్రీరంగం కవర్ చెయ్యొచ్చు

చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్

  • జనవరి 7, 9, 16 తేదీల్లో ప్రతి గురు, శనివారం సాయంత్రం 7: 40 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07115 ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది.
  • తిరుగు ప్రయాణంలో జనవరి 8, 10, 17 తేదీల్లో ప్రతి శుక్ర, ఆదివారం మధ్యాహ్నం 2: 30 గంటలకు శ్రీకాకుళం రోడ్ నుంచి బయలుదేరే నంబర్ 07116 ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
  • నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్ల మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
ఐపీఎల్ ఆక్షన్ లో ఆర్యవీర్ సెహ్వాగ్: ఎవడు కొంటాడో గానీ.. !!
ఐపీఎల్ ఆక్షన్ లో ఆర్యవీర్ సెహ్వాగ్: ఎవడు కొంటాడో గానీ.. !!

హైదరాబాద్- నర్సాపూర్

  • జనవరి 9, 16 తేదీల్లో ప్రతి శనివారం సాయంత్రం 7:40 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయలుదేరే నంబర్ 07117 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారు ఉదయం 7 గంటలకు నర్సాపూర్ కు చేరుకుంటుంది.
  • తిరుగు ప్రయాణంలో జనవరి 10, 17 తేదీల్లో ఆదివారం రాత్రి 8 గంటలకు నర్సాపూర్ నుంచి బయలుదేరే నంబర్ 07118 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారు ఉదయం 8:35 నిమిషాలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది.
  • సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+