సికింద్రాబాద్ నుంచి ఏపీ మీదుగా వారణాశి, అయోధ్య స్పెషల్: హాల్ట్ స్టేషన్లు

Secunderabad- Varanasi Ayodhya tourist special train: సికింద్రాబాద్ నుంచి వారణాసి, అయోధ్య యాత్ర పేరుతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. పూరీ- కోణార్క్- ప్రయాగ్ రాజ్ వంటి పుణ్య క్షేత్రాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా ఆలయాలను భక్తులు దర్శించుకోవచ్చు. ప్రత్యేక పూజలు చేయవచ్చు. తొమ్మిది రాత్రులు/ 10 పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది.

డిసెంబర్ 5వ తేదీన సికింద్రాబాద్ నుండి ఈ భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 705 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్- 237, 3ఏసీ- 416, 2ఏసీ- 52. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ కు చర్లపల్లి, ఖాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్‌లల్లో హాల్ట్ సౌకర్యం ఉంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు.

IRCTC to run Varanasi- Ayodhya Punya Kshetra Yatra Bharat Gaurav express from Secunderabad in Dec 5

మొదట పూరీకి వెళ్తుందీ ఎక్స్ ప్రెస్. అక్కడ జగన్నాథుడిని దర్శించుకోవచ్చు. ప్రత్యేక పూజలు చేయవచ్చు. కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శించవచ్చు. అనంతరం బద్రీనాథ్ ధామ్ కు చేరుకుంటుంది. అక్కడ బద్రీనాథుడి దర్శనం అనంతరం నేరుగా వారణాశి వెళ్తుంది. కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయాల్లో పూజల్లో పాల్గొనవచ్చు. అక్కడి కారిడార్‌ సందర్శనం కూడా ఈ టూర్ ప్యాకేజీలో ఉంది. సాయంత్రం గంగా హారతిని తిలకించవచ్చు.

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక ఫార్ములా?
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక ఫార్ములా?

దీని తర్వాతి గమ్యస్థానం అయోధ్య. చారిత్రాత్మక బాలరాముడి ఆలయం, హనుమాన్ గర్హి ఆలయాలను దర్శించవచ్చు. అక్కడి సరయూ నది హారతిలో పాల్గొనవచ్చు. అక్కడి నుంచి ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటుంది ఈ ఎక్స్ ప్రెస్. త్రివేణి సంగమంలో స్నానం ఆచరించే అవకాశం కల్పించింది ఐఆర్సీటీసీ ఈ టూర్ ద్వారా. ప్రయాగ్ రాజ్ సందర్శనతో ఈ టూర్ ప్యాకేజీ టూర్ ముగుస్తుంది. అక్కడి నుంచి మళ్లీ సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్.

డబ్ల్యూటీసీ ఫైనల్ సినారియో: టీమిండియా ఆశలపై నీళ్లు చల్లిన న్యూజిలాండ్
డబ్ల్యూటీసీ ఫైనల్ సినారియో: టీమిండియా ఆశలపై నీళ్లు చల్లిన న్యూజిలాండ్

ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 17,000 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 15,800 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీ (3ఏసీ)లో పెద్దలకు 26,400, పిల్లలకు 25,000 రూపాయలు, కంఫర్ట్ కేటగిరీ (2ఏసీ)లో పెద్దలకు 34,400, పిల్లలకు 32,700 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీలో రైలు టికెట్లు, రోడ్డు రవాణా, హోటల్ వసతి, భోజనం, ఇన్సూరెన్స్ వంటివి ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+