కార్తీక పౌర్ణమి వేళ భక్తులతో పోటెత్తిన అరుణాచలం- గిరి ప్రదక్షిణ టైమింగ్స్, మహా దీపం ఇలా..!!

తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తుతున్నారు. ఇక్కడ కార్తీక పౌర్ణమికి ప్రత్యేకత ఉంది. ఈ సమయంలో గిరి ప్రదక్షిణ అత్యంత విశిష్టమైనది కావటంతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈ రాత్రి నుంచే గిరివలమ్ ప్రారంభం కానుంది. దాదాపు 50 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా. కాగా, పౌర్ణమి గడియల్లో ఇక్కడ 2,668 అడుగుల ఎత్తైన అరుణాచల కొండ శిఖరంపై మహా దీపం వెలిగిస్తారు. దీంతో... అరుణాచలం ఇప్పుడు ఆధ్మాత్మిక వాతావరణంలో శోభిల్లుతోంది.

ప్రసిద్ధ శైవక్షేత్రం తిరువణ్ణామలైలో కార్తిక పౌర్ణమి గిరిప్రదక్షిణకు రంగం సిద్ధమైంది. మహాదీపోత్స వానికి ఒక రోజు ముందే ఈ రోజు(సోమవారం) రాత్రి 11:42 గంటల నుంచి గిరివలమ్ ప్రారంభం కానుంది. మంగళవారం (నవంబర్ 24) రాత్రి 8:23 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగు తుంది. ఈ ఆధ్యాత్మిక వేడుకలకు దేశవిదేశాల నుంచి ఏకంగా 50 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. రేపు (మంగళవారం) పౌర్ణమి వేళ 2,668 అడుగుల ఎత్తైన అరుణాచల కొండ శిఖరంపై మహా దీపం వెలిగిస్తారు. శివుడు అగ్ని లింగ రూపంలో దర్శనమిచ్చిన ప్రదేశంగా భావించే ఈ క్షేత్రంలో జరిగే కార్తీక దీపోత్సవం అత్యంత విశిష్టమైనది. దాదాపు 21 గంటల పాటు భక్తులు 14 కిలోమీటర్ల మేర సాగే పవిత్ర గిరివలమ్ చేసుకునే సదుపాయం లభించింది.

TTD: పది రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు- టికెట్ల జారీ ఇలా, వీరికి అరుదైన అవకాశం..!!
TTD: పది రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు- టికెట్ల జారీ ఇలా, వీరికి అరుదైన అవకాశం..!!
tiruvannamalai-karthigai-deepam-over-50-lakh-devotees-expected-for-girivalam-details-here

50 లక్షల వరకు వస్తారని అంచనా

సాధారణంగా కార్తిక మాసం పౌర్ణమి నాడు లేదా మహాదీపం వెలిగించిన మరుసటి రోజు గిరిప్రదక్షిణ మొదలవుతుంది. అయితే ఈ ఏడాది మహాదీపం వెలి గించే ముందు రోజు రాత్రే గిరివలమ్ సమయం ప్రారంభం కానుంది. కాగా.. మంగళవారం ఉదయం, మధ్యాహ్నం వేళల్లో కూడా భక్తులు కొండ చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం ఉంది. కార్తిక దీపోత్సవం, చిత్రా పౌర్ణమి సమయాల్లో తిరువణ్ణామలైకి భక్తులు పోటెత్తుతారు. సాధారణంగానే 40 లక్షల మంది వరకు వస్తుంటారనని ఆలయ అధికారులు చెబుతున్నారు. అయితే.. ఈ సారి గిరివలమ్, మహాదీపం రెండూ కలిసి రావడంతో ఆ సంఖ్య 50 లక్షలు దాటుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు, వసతులు కల్పిస్తున్నారు. కాగా.. కొండ పైకి భక్తులు ఎక్కడాన్ని అధికారులు పూర్తిగా నిషేధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+