గోకులవనంలో ప్రకృతి వివాహం: పెళ్లి విందు చాలా ప్రత్యేకం!

పెళ్లిళ్లు అంటే అట్టహాసాలు, భారీ ఫంక్షన్ హాళ్లు, రసాయనాలు కలిసిన ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ వినియోగం అనే భావనకు భిన్నంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక వినూత్న వివాహం జరిగింది. గత రెండు దశాబ్దాలుగా ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరిస్తున్న ఓ రైతు తన కూతురి పెళ్లిని పూర్తిగా ప్రకృతి, సేంద్రియ పద్ధతుల చుట్టూ తిరిగేలా నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు.

భువనగిరి మండలం చందుపట్ల గ్రామానికి చెందిన వ్యాపారవేత్త, ప్రకృతి సాగు రైతు తుమ్మల సత్తిరెడ్డి కుమార్తె వీణ వివాహం మహారాష్ట్రకు చెందిన అజిత్‌తో ఆదివారం ఘనంగా జరిగింది.ఈ కల్యాణాన్ని ఎలాంటి ఫంక్షన్ హాల్‌లో కాకుండా, గ్రామంలోని తమ వ్యవసాయ క్షేత్రమైన 'గోకులవనం'లో పచ్చని చెట్ల నీడన, ప్రకృతి ఒడిలో నిర్వహించడం విశేషం. వేడుకలో ఎక్కడా ప్లాస్టిక్ వస్తువులు కనిపించకుండా పర్యావరణ హిత ఏర్పాట్లు చేశారు.

Organic Wedding in Yadadri Farmer family Hosts Eco-Friendly Feast with 22 Natural Dishes for their daughter marriage

వచ్చిన అతిథులకు ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో గో ఆధారిత వ్యవసాయంలో పండించిన ధాన్యాలు, కూరగాయలు, పప్పులు, గానుగ నూనె, దేశీ ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించి 22 రకాల వంటకాలు సిద్ధం చేశారు. ఈ వేడుక ప్రత్యేకత కేవలం మెనూకే పరిమితం కాలేదు; వంటకాలకు అవసరమైన సామగ్రిలో ఎక్కువ భాగాన్ని స్థానికంగా గ్రామంలోనే సేకరించడం ద్వారా ఊరి రైతులకు, చేతివృత్తుల వారికి కూడా ప్రోత్సాహం లభించింది.

వంటల తయారీని సైతం జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి శ్రీనాథ్, తెలంగాణ గోశాలల సేవా సమితి అధ్యక్షుడు విజయరామ్, ప్రధాన కార్యదర్శి ఝాన్సీ లక్ష్మీభాయి, ప్రకృతి వ్యవసాయదారుడు గాదె అశోక్‌రెడ్డి పర్యవేక్షణలో రైతులే స్వయంగా వండి వడ్డించడం ఈ పెళ్లికి మరింత ప్రత్యేకతను చేకూర్చింది.

సికింద్రాబాద్‌లో 8నెలలు 16జంక్షన్లలో ట్రాఫిక్ ఆంక్షలు.. రాణిగంజ్ అండర్‌బ్రిడ్జ్‌పై భారీ వాహనాలకు నిషేధం
సికింద్రాబాద్‌లో 8నెలలు 16జంక్షన్లలో ట్రాఫిక్ ఆంక్షలు.. రాణిగంజ్ అండర్‌బ్రిడ్జ్‌పై భారీ వాహనాలకు నిషేధం

ఇటీవలి కాలంలో రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించి ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు మొగ్గుచూపే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా వివాహాలు, శుభకార్యాల్లో ప్లాస్టిక్ నిషేధం, స్థానిక ఉత్పత్తుల వినియోగం, సేంద్రియ ఆహారం వంటి అంశాలు సమాజంలో సానుకూల మార్పుకు దారితీస్తున్నాయి. సత్తిరెడ్డి కుటుంబం చేపట్టిన ఈ ప్రయత్నం ప్రకృతి వివాహం పట్ల అందరికీ ఆసక్తి కలిగేలా చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+