బంగారం ధరలు హఠాత్తుగా పెరిగాయ్- బిగ్ జంప్

కొద్దిరోజులుగా దేశీయంగా భారీగా పడిపోతూ వచ్చిన పసిడి, వెండి ధరలు నేడు పుంజుకొన్నాయి. తిరిగి రికవరీ బాట పట్టాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై పెట్టుబడిదారుల అంచనాలు మారడం, దేశంలో వివాహాల సీజన్ కారణంగా కొనుగోళ్లు భారీగా పెరుగుతోండటం దీనికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. బులియన్ మార్కెట్ లో ఇక ముందు కూడా ఇదే పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

అంతర్జాతీయ కమోడిటీ ఎక్స్ఛేంజ్ కామెక్స్‌లో ప్రారంభ ట్రేడింగ్‌లోనే బంగారం, వెండి కాంట్రాక్టులు కోలుకున్నాయి. కామెక్స్‌లో బంగారం ధర ఏకంగా 2.06 శాతం మేర పెరిగి ప్రతి ఔన్సుకు 3,606.90 డాలర్ల వద్ద విక్రయమైంది. వెండి నాణేలు, ఫ్యూచర్స్ ధరలు కూడా 2.15 శాతం మేర ఎగబాకి, ప్రతి ఔన్సుకు 42.100 డాలర్ల స్థాయిని తాకాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు సురక్షితమైన డిపాజిట్‌గా భావించి కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో ధరల్లో ఈ వేగం కనిపించింది.

Gold and silver prices gets sharp rebound after recovering from lowest levels at MCX in 24K 22K 18K

దీని ప్రభావం దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ అయిన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌పై పడింది. ఇక్కడా బంగారం, వెండి ధరల హవా కొనసాగింది. శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల బంగారం ధరలో రూ. 1,480 పెరుగుదల కనిపించింది. 24 క్యారెట్లల్లో రూ. 1,350, 18 క్యారెట్లల్లో రూ. 1,110 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,24,100 వద్ద ట్రేడ్ అయింది. ఇక వెండి విషయంలో ఈ పెరుగుదల మరింత ఎక్కువగా నమోదైంది. ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర ఏకంగా రూ. 3,500 వరకు ఎగబాకి రూ.1,51,328 వద్ద నిలిచింది.

బిస్లెరీ ఎంతమాత్రం సేఫ్ కాదు..: FSSAI
బిస్లెరీ ఎంతమాత్రం సేఫ్ కాదు..: FSSAI

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,770 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,14,373 గా నమోదైంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,24,540 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. రూ. 1,14,162 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,24,930, రూ.1,14,519 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,24,670, 22 క్యారెట్లు రూ. 1,14,281 వద్ద కొనసాగుతున్నాయి.

పాకిస్తాన్- ఏ చేతిలో టీమిండియా పరాజయం: తిలక్ వర్మ సెంచరీ చేసినా.. !!
పాకిస్తాన్- ఏ చేతిలో టీమిండియా పరాజయం: తిలక్ వర్మ సెంచరీ చేసినా.. !!

నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 12,656, 22 క్యారెట్లు - రూ. 11,600, 18 క్యారెట్లు - రూ. 9,495

ముంబై..

24 క్యారెట్లు- రూ. 12,656, 22 క్యారెట్లు - రూ. 11,600, 18 క్యారెట్లు - రూ. 9,491

బెంగళూరు..

24 క్యారెట్లు- రూ. 12,656, 22 క్యారెట్లు - రూ. 11,600, 18 క్యారెట్లు - రూ. 9,491

హైదరాబాద్..

24 క్యారెట్లు- రూ. 12,656, 22 క్యారెట్లు - రూ. 11,600, 18 క్యారెట్లు - రూ. 9,491

విజయవాడ..

24 క్యారెట్లు- రూ. 12,656, 22 క్యారెట్లు - రూ. 11,600, 18 క్యారెట్లు - రూ. 9,491

విశాఖపట్నం..

24 క్యారెట్లు- రూ. 12,656, 22 క్యారెట్లు - రూ. 11,600, 18 క్యారెట్లు - రూ. 9,491

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+