నందమూరి బాలకృష్ణ పీఏ అరెస్టు - మారణాయుధాలు స్వాధీనం..!!

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో 65 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 66 మందిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తిమ్మాపురం గ్రామంలో సర్పంచ్‌ పదవి కోసం మొదలైన పోటీ.. రెండు వర్గాల మధ్య వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో మారణాయుధాలు దొరకటం సంచలనంగా మారింది.

పంచాయితీ ఎన్నికల వేళ పల్నాడు జిల్లాలో మారణాయుధాలు కలిగి ఉన్నారన్న అభియోగాలపై నందమూరి బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావు పై కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో 65 మందిని పల్నాడు పోలీసులు అరెస్టు చేశారు. 66 మందిపై నాన్-బె యిలబుల్ కేసులు నమోదు చేశామని, వారిని కోర్టుకు హాజరు ప‌రుస్తామని నరసరావుపేట ఏఎస్పీ హనుమంతరావు చెప్పారు. చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం గ్రామంలో సర్పంచ్ పదవి నామినేషన్ల ప్రక్రియ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ టీడీపీలోని అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. సర్పంచ్ పదవి కోసం స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అనుచరుడు, టీడీపీకి చెందిన నాగండ్ల రాంబాబుతో పాటు పావులూరి శ్రీనివాసరావు వర్గాలు పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేశాయి. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం తారస్థాయికి చేరింది.

పొంచి ఉన్న మరో రెండు తుఫాన్ల ముప్పు, సమృద్ధిగా వర్షాలు ఇక అప్పుడే..!!
పొంచి ఉన్న మరో రెండు తుఫాన్ల ముప్పు, సమృద్ధిగా వర్షాలు ఇక అప్పుడే..!!
nandamuri-balakrishna-pa-pavuluri-srinivasa-rao-arrested-along-with-65-others-in-palnadu-district

పోలీసుల విచారణ ప్రారంభం

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో రెండు వర్గాలు రాజీ మార్గంలో వెళ్లినా.. పంచాయితీ ఎన్నికల సమయంలో మాత్రం విభేదాలు బయట పడ్డాయి. సర్పంచ్ పదవికి రెండు వర్గాల నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తరువాత తిమ్మాపురంలోని శ్రీనివాసరావుకు చెందిన ఓ మిల్లులో పోలీసులు తనిఖీలు చేశారు. అక్కడ కర్రలు, కత్తులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో పోలీసులకు, శ్రీనివాసరావు వర్గీయులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి శ్రీనివాసరావుతో పాటు మొత్తం 66 మందిని అదుపులోకి తీసుకుని నాదెండ్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని చెదర గొట్టారు. పోలీసులు ఈ మొత్తం వ్యవహారం పైన విచారణ ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+