పొంచి ఉన్న మరో రెండు తుఫాన్ల ముప్పు, సమృద్ధిగా వర్షాలు ఇక అప్పుడే..!!
ఒకటి కాదు రెండు తుఫాన్ల పై బిగ్ అప్డేట్. ఆర్నబ్, మురుసు తుఫాన్లు ఏపీకి భారీ నష్టం చేసాయి. తరువాత ఆక్వాన్ తుఫాను గండం తప్పింది. అయితే, ఇప్పుడు వాతావరణ నిపుణులు తాజా అంచనాలను వెల్లడిస్తున్నారు. బంగాళాఖాతంలో రెండు తుఫాన్ల ముప్పు పొంచి ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరు.. డిసెంబర్ రెండో వారంలో ఇవి ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా.. ఎల్ నినో ప్రభావం మరి కొంత కాలం ఉంటుందని చెబుతూనే... సమృద్ధిగా వర్షాల పైన స్పష్టమైన అంచనాలను వెల్లడించారు.
బంగాళాఖాతంలో మరో రెండు తుఫాన్ల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరుకు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది బలపడి తుఫాన్ గా మారి వచ్చే నెల నాలుగో తేదీ తరువాత శ్రీలంక, దక్షిణ తమిళనాడు దిశగా రానున్నదాని అంచనా వేసారు. అదే విధంగా డిసెంబర్ రెండో వారంలో మరో తుఫాను వచ్చే అవకాశం ఉందని.. దాని గురించి ఇంకా స్పష్టత రావాల్సి ఉందని వెల్లడించారు. కాగా.. ఎల్‌నినో పరిస్థితులు వచ్చే ఏడాది మార్చి తర్వాత బలహీనపడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో 2027 నైరుతి రుతుపవనాలకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (ఇన్‌కాయిస్) శాస్త్రవేత్తలు తెలిపారు.

వాతావరణ శాఖ తాజా అంచనాలతో
కాగా, ప్రస్తుత నవంబరు నెల నుంచి 2027 మార్చి వరకు ఎల్‌నినో కొనసాగడానికి 87 నుంచి 100 శాతం అవకాశముందని..డిసెంబరు తర్వాత దీని తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టే సూచన లు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. 2027 ఏప్రిల్-జూన్ మధ్య తటస్థ వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని,జూన్- ఆగస్టు మధ్య లానినా పరిస్థితులు ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు. సముద్ర అంతర్భాగంలోనూ సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం బలమైన్ ఎల్‌నినోకు నిదర్శనమని ఆ సంస్థ పేర్కొంది. అయితే, మనదేశంలో వర్షపాతం కేవలం ఎల్‌నినో, లానినాలపై ఆధారపడి ఉండదని తెలిపింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, గాలుల దిశ, వేగం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయని వెల్లడించింది. దీంతో, 2027 వేసవి తరువాత వర్షాలు పూర్తి స్థాయిలో కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications
