బీజేపీలో చేరిన యుజ్వేంద్ర చాహల్- పార్టీలో కీలక పదవి...!!
యువ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తన పొలిటికల్ ఇన్నింగ్ ను అధికారికంగా ప్రారంభించారు. బీజేపీలో చేరడానికి ముందు ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అమర్ పాల్ మౌర్యతో చాహల్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీజేపీలో చేరిన వెంటనే చాహల్ కు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నియమించారు.
టీం ఇండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. క్రికెట్ లో తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన చాహల్, ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. చాహల్ భారతీయ జనతా పార్టీలో అధికారికంగా ఎంట్రీ ఇచ్చారు. పార్టీలో చేరిన చాహల్ కు ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గంలో చాహల్‌ను ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ఆఫీస్ బేరర్లు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఇతర నియామకాలకు సంబంధించిన జాబితాను పార్టీ శనివారం విడుదల చేసింది. ఇందులో దిల్లీ తరఫున ప్రత్యేక ఆహ్వానితుడిగా చాహల్ పేరును ప్రకటించారు.

బీజేపీలో కీలక బాధ్యతలు
కాగా, బీజేపీలో చేరిక.. కొత్త బాధ్యతల పై చాహల్ స్పందించారు. బీజేపీ కుటుంబంలో తనకు స్థానం, గౌరవం కల్పించినందుకు ప్రధాని మోదీ, అమిత్ షా కు ధన్యవాదాలు తెలిపారు. ఇక నుంచి పార్టీలో అప్పగించిన బాధ్యతలను పూర్తి స్థాయిలో సమర్ధవంతంగా నిర్వహిస్తానని చాహల్ ప్రకటించారు. చాహల్ భారత్ తరఫున ఇప్పటివరకు 72 వన్డేలు ఆడి 121 వికెట్లు పడగొట్టారు. 80 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 96 వికెట్లు తీశారు. ఐపీఎల్ టోర్నీలో వివిధ ఫ్రాంచైజీల తరఫున 188 మ్యాచ్‌లు ఆడిన చాహల్, ఏకంగా 233 వికెట్లతో లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా నిలిచారు. ఇక, ఇప్పుడు రాజకీయంగా చాహల్ సక్సెస్ ఎలా ఉంటుంది అనేది అటు క్రికెట్.. ఇటు పొలిటికల్ గానూ ఆసక్తి పెంచుతోంది.












Click it and Unblock the Notifications
