తెలంగాణలోని వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఏడు రోజులే డెడ్ లైన్..
తెలంగాణలోని వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమర్చడంపై రాష్ట్ర రవాణాశాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 1,54,032 వాహనాలకు ఇంకా HSRP ప్లేట్లు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొంది.
ఈ ప్రక్రియను ఏడు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నిబంధనలు పాటించని డీలర్లపై జరిమానాలు, ట్రేడ్ సర్టిఫికెట్ సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఇక 1989 మోటారు వాహనాల చట్టంలోని రూల్ నెంబర్ 50 ప్రకారం ఈ ప్లేట్లను అమర్చాల్సి ఉంటుందని తెలిపింది.

ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 6,10,330 వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం. అయితే వీటిలో 4,56,298 వాహనాలకు ఇప్పటికే HSRP నంబర్ ప్లేట్ల ఏర్పాటు పూర్తయింది. అలాగే మరో 1,54,032 వాహనాలకు HSRP ప్లేట్లు అమర్చాల్సి ఉంది. ఈ పెండింగ్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications
