విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 24 న పాఠశాలలకు సెలవు
దేశంలోని పలు రాష్ట్రాలు విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపాయి. నవంబర్ 24 మంగళవారం రోజున ఆయా రాష్ట్రాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నవంబర్ 24 దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో గురు పౌర్ణమి ఘనంగా నిర్వహిస్తారు. గురునానక్ జయంతి సందర్భంగా ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగనే ప్రకాశ్ పురబ్ లేదా గురు పురబ్ అని పిలుస్తుంటారు. విద్య సంవత్సరం క్యాలెండర్ 2026 ప్రకారం.. బిహార్, ఉత్తర్ ప్రదేశ్, దిల్లీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో నవంబర్ 24 న పాఠశాలలకు సెలవు ఉంది.
ఈ రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ పాఠశాలలకు సెలవు ప్రకటించాయి అక్కడి ప్రభుత్వాలు. ఈ మేరకు పిల్లలు, తల్లిదండ్రులు ఏమైనా ప్లాన్ చేసే ముందు సంబంధిత స్కూల్ నోటీస్ బోర్డును పరిశీలించాలని అధికారులు స్పష్టం చేశారు. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే బిహార్ లో నవంబర్ 24న పాఠశాలకు సెలవు ఉండనుంది. రాష్ట్ర హాలీడే క్యాలెండర్ లోనూ ఈ విషయాన్ని పొందుపరిచారు.

ఇక ఉత్తర్ ప్రదేశ్ లోనూ స్టేట్ హాలీడే లిస్టులో నవంబర్ 24 గురు నానక్ జయంతి లేదా కార్తిక పౌర్ణమి కానుకగా సెలవు ఉంది. అలాగే పశ్చిమ్ బెంగాల్ లో నవంబర్ 24 న సెలవు అధికారికంగా ప్రకటించారు. అలాగే దేశ రాజధాని దిల్లీలోనూ నవంబర్ 24 న రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. ఇదే రోజున దిల్లీ నగరంలో గురు తేజ్ బహదూర్ వీరమరణాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తుంటారు. మహారాష్ట్ర, పంజాబ్, హరియాణా, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాల్లోనూ నవంబర్ 24 న పాఠశాలలు మూతపడనున్నాయి.












Click it and Unblock the Notifications
