వస్తాడు.. హిట్ కొడతాడు.. వెళ్తాడు.. రిపీటు..
కోలీవుడ్ హీరో ధనుష్ వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. గతేడాది కుబేర సినిమాతో అలరించిన ఆయన తాజాగా ఓం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం నవంబరు 20న రిలీజ్ అయింది. అయితే ఈ మూవీకి ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీకి అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.
ఇక ఈ మూవీలో ధనుష్ కు జోడీగా సాయి పల్లవి నటించారు. అలాగే మలయాళ మెగాస్టార్ ముమ్ముట్టి ఇందులో కీలక పాత్రలో కనిపించారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ స్వరాలు అందించారు. ఇక వండర్బార్ ఫిల్మ్స్, ఆర్టేక్ స్టూడియోస్ బ్యానర్లపై ధనుష్, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మాగ్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. ఇక ఓం మూవీకి వరల్డ్ వైడ్ గా అద్దిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి.
పాన్ ఇండియా వైడ్ గా తెలుగు , తమిళ భాషలకు కలిపి 24 కోట్ల రూపాయిల గ్రాస్ ను ఈ మూవీ వసూలు చేసినట్లు స్పష్టం అవుతోంది. అటు ఓవర్సీస్ నుంచి రూ. 11 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ఇక ఓవరాల్ గా ఈ మూవీకి తొలి రోజు రూ. 35 కోట్ల గ్రాస్ వచ్చిందని.. ధనుష్ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇక ఓం మూవీ కలెక్షన్స్ కు సంబంధించి ప్రాంతాల వారీగా చూస్తే.. తమిళనాడు ప్రాంతం నుంచి ఈ చిత్రానికి రూ. 12 కోట్ల 50 లక్షల వరకు వచ్చినట్లు సమాచారం. అలాగే ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ నుంచి ఏపీ, తెలంగాణ దాదాపు రూ. 5 కోట్ల 20 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ మూవీకి రెండో రోజు కూడా భారీ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఓం మూవీ మరిన్ని రికార్డులను కొల్లగొట్టే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications
