పీఎం స్వనిధిలో జాతీయ స్థాయిలో టాప్ 2లో తెలంగాణా!

వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబన కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి సమ్మాన్‌ పథకం నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం మరోసారి తన ప్రతిభను చాటుకుంది. దేశవ్యాప్తంగా పథకం అమలు తీరులో తెలంగాణ రెండో స్థానాన్ని కైవసం చేసుకుని ఘనత సాధించింది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల కృషి, లబ్ధిదారులకు వేగంగా రుణాలు అందజేసిన విధానం ఈ గుర్తింపునకు దారితీసింది.

ఈ పథకం అమలులో నిర్మల్‌ మున్సిపాలిటీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి ప్రత్యేకంగా ఆకర్షించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రం తరఫున అవార్డు అందుకునే బాధ్యతను ప్రభుత్వం నిర్మల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ మంద రవిబాబుకు అప్పగించింది. శుక్రవారం న్యూదిల్లీలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ చేతుల మీదుగా ఆయన స్వనిధి సమ్మాన్‌-2026 పురస్కారాన్ని స్వీకరించారు.

SVANidhi Samman Telangana Shines in SVANidhi Samman Implementation Secures Second Place Nationally

క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే నిర్మల్‌కు రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానం, రాష్ట్రానికి జాతీయ స్థాయిలో రెండో స్థానం లభించాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పీఎం స్వనిధి పథకం గురించి మరిన్ని వివరాలుచిరు వ్యాపారులు, తోపుడు బండ్లు నడుపుకునేవారు, ఫుట్‌పాత్‌లపై విక్రయాలు జరిపేవారు తమ వ్యాపారాలను తిరిగి గాడిన పెట్టుకునేందుకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జూన్‌ 2020లో పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించింది.

ఎలాంటి పూచీకత్తు లేకుండా కొలేటరల్‌ ఫ్రీ వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.విడతల వారీ రుణ సదుపాయం: పునర్వ్యవస్థీకరించిన పథకం ప్రకారం అర్హులైన వీధి వ్యాపారులకు మొదటి విడతలో రూ. 15,000 వరకు, రెండో విడతలో రూ. 25,000 వరకు, మూడో విడతలో రూ. 50,000 వరకు రుణాలు అందుతాయి. నిర్ణీత వ్యవధిలో సక్రమంగా తిరిగి చెల్లిస్తే తదుపరి విడతలో అధిక రుణానికి అర్హత లభిస్తుంది.

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల రైతులకు మంత్రి తుమ్మల శుభవార్త!
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల రైతులకు మంత్రి తుమ్మల శుభవార్త!

వడ్డీ రాయితీ, డిజిటల్‌ ప్రోత్సాహకాలు: రుణాలను సకాలంలో చెల్లించే లబ్ధిదారులకు ఏటా 7 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. అలాగే డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు క్యాష్‌బ్యాక్‌ ప్రయోజనాలు కల్పిస్తున్నారు.రూపే క్రెడిట్‌ కార్డు, పొడిగింపు: రెండో విడత రుణాన్ని విజయవంతంగా తీర్చిన అర్హులైన వ్యాపారులకు యూపీఐ అనుసంధానంతో కూడిన రూపే క్రెడిట్‌ కార్డు రూ. 30,000 పరిమితి వరకు సదుపాయం కూడా ఉంది. ఈ పథకం రుణ కాలాన్ని మార్చి 31, 2030 వరకు పొడిగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+