'హనుమాన్' సీక్వెల్ లో మెగా హీరో.. సంచలన అప్డేట్.. కన్ ఫ్యూజన్ లో ఫ్యాన్స్..
భారతీయ సినీ చరిత్రలో హనుమాన్ మూవీ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మనకు తెలిసిందే. హనుమాన్ మూవీ 2024 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కే. నిరంజన్ రెడ్డి నిర్మించారు. హనుమాన్ మూవీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ మూవీ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కాంతార, కాంతార చాప్టర్ 1 చిత్రాల్లోని తన వైవిధ్యమైన నటనతో సినీ ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచిన రిషబ్.. ఇప్పుడు ఈ మైథలాజికల్ రోల్ లో ఎలా కనిపిస్తారో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. భక్తి ఎలిమెంట్స్ కు తోడుగా అదిరిపోయే యాక్షన్ విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో ప్రధాన బలంగా ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది.
అయితే హనుమాన్ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఒరిజినల్ నిర్మాతలైన ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ లు తలెత్తి ప్రశాంత్ వర్మ ఆ బ్యానర్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత ఆయన టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తో చేతులు కలిపారు.

ఈ నేపథ్యంలో హనుమాన్మూవీ ఒరిజినల్ నిర్మాత సంస్థ ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ హనుమాన్ 2 ను తాజాగా ప్రకటించింది. ఈ క్రేజీ సీక్వెల్ లో మెగా హీరో వైష్ణవ్ తేజ్ ను హీరోగా ఎంపిక చేశారు. హనుమాన్ 2 ది రైజ్ ఆఫ్ వానరాస్ టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఇక ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఇంతకుముందు 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'.. 'ఊరు పేరు భైరవకోన' చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
#Vaisshu babu wishing you huge success and happiness with this beautiful project ra, we know how much you struggled in the last couple of years, me and AMMA prayed to our favourite god “LORD HANUMA” and here to our surprise you are doing a movie on his name… thank you for the lovely surprise babu love you loads ❤️All the best to the whole team 🙏🏼
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 21, 2026
ఇక ఓ వైపు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ తెరకెక్కిస్తుండటం.. మరోవైపు ఒరిజినల్ నిర్మాణ సంస్థ హనుమాన్ 2 ది రైజ్ ఆఫ్ వానరాస్ ను నిర్మిస్తుండటంతో ఈ రెండిట్లో ఏది నిజమైన సీక్వెల్ అని ఫ్యాన్స్ కన్ ఫ్యూజన్ లో ఉన్నారు. ఇక ఈ అంశం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications
